AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో 56 బీసీ కార్పొరేషన్ల ప్రకటన.. ఛైర్మన్ల పేర్లు

బీసీల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల ప్రకటన వెలువడింది. బీసీ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు , డైరెక్టర్ల పేర్లను ఆదివారం తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు. మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి. వీటిలో ఒక్కో కార్పొరేషన్‌కు ఛైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కాగా, ఛైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం […]

ఏపీలో 56 బీసీ కార్పొరేషన్ల ప్రకటన.. ఛైర్మన్ల పేర్లు
Venkata Narayana
|

Updated on: Oct 18, 2020 | 2:18 PM

Share

బీసీల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల ప్రకటన వెలువడింది. బీసీ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు , డైరెక్టర్ల పేర్లను ఆదివారం తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు. మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి. వీటిలో ఒక్కో కార్పొరేషన్‌కు ఛైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కాగా, ఛైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకర్‌ నారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ఇక, బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పేర్లు ఈ విధంగా ఉన్నాయి.

బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పేర్లు :

రజక కార్పొరేషన్‌: రంగన్న (అనంతపురం) కురుబ కార్పొరేషన్‌: కోటి సూర్యప్రకాశ్‌ బాబు (అనంతపురం) తొగట కార్పొరేషన్‌: గడ్డం సునీత (అనంతపురం) కుంచిటి వక్కలిగ: డా.నళిని(అనంతపురం) వన్యకుల క్షత్రియ: కె. వనిత (చిత్తూరు) పాల ఎకరి: టి. మురళీధర్ (చిత్తూరు) ముదళియర్ : తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు) ఈడిగ : కె.శాంతి (చిత్తూరు) గాండ్ల : భవాణీ ప్రియ (తూ.గో) పెరిక : పురుషోత్తం గంగాభవానీ (తూ.గో) అగ్నికుల క్షత్రియ: భండన హరి (తూ.గో) అయ్యారక: రాజేశ్వరం (తూ.గో) షేక్ : షేక్ యాసీన్ (గుంటూరు) వడ్డెర: దేవల్లి రేవతి (గుంటూరు) కుమ్మరి శాలివాహన: పురుషోత్తం(గుంటూరు) కృష్ణ బలిజ/పూసల: కోలా భవాణీ (గుంటూరు) యాదవ: హరీష్‌కుమార్ (కడప) నాయిబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య (కడప) పద్మశాలీ: విజయలక్ష్మి (కడప) నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్‌బి (కడప) సాగర ఉప్పర : గనుగపేట రమణమ్మ (కడప) విశ్వ బ్రాహ్మణ : తోలేటి శ్రీకాంత్ (కృష్ణా) గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా) వడ్డెలు: సైదు గాయత్రి సంతోష్ (కృష్ణా) భట్రాజు: గీతాంజలి దేవి (కృష్ణా) వాల్మీకి బోయ: డా.మధుసూదన్ (కర్నూలు) కుమి/కరికల భక్తుల: శారదమ్మ (కర్నూలు) వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్ (కర్నూలు) ముదిరాజ్: వెంకటనారాయణ (నెల్లూరు) జంగం: ప్రసన్న (నెల్లూరు) బొందిలి : కిషోర్ సింగ్ (నెల్లూరు) ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు) చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్‌కుమార్ (ప్రకాశం) ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి(ప్రకాశం) దేవాంగ : సురేంద్రబాబు (ప్రకాశం) మేదర : లలిత నాంచారమ్మ(ప్రకాశం) కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం) కళింగ కోమటి/ కళింగ వైశ్య: సూరిబాబు (శ్రీకాకుళం) రెడ్డిక: లోకేశ్వరరావు (శ్రీకాకుళం) పోలినాటి వెలమ: కృష్ణవేణి (శ్రీకాకుళం) కురకుల/పొండర: రాజపు హైమావతి(శ్రీకాకుళం) శ్రీసైన: చీపురు రాణి( శ్రీకాకుళం) మత్స్యకార : కోలా గురువులు (విశాఖ) గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ) నగరాల: పిల్లా సుజాత (విశాఖ) యాత: పి.సుజాత (విశాఖ) నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ) తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం) కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు(విజయనగరం) శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం) దాసరి: రంగుముద్రి రమాదేవి (విజయనగరం) సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి (ప.గో) శెట్టి బలిజ: తమ్మయ్య (ప.గో) అత్యంత వెనుకబడిన వర్గాల: వీరన్న (ప.గో) అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్‌రావు(ప.గో)

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్