చెన్నైలో తీవ్ర నీటి సంక్షోభం!

దక్షిణాది రాష్ట్రాలలోని అన్ని రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు ఇప్పటికే కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ రాష్ట్రాలలో తమిళనాడు పరిస్థితి మరింత అద్వానంగా ఉంది. తమిళనాడు లోని జలాశయాలలో నీటి మట్టాలు సాధారణం కన్నా 99 శాతం తక్కువగా ఉన్నాయి. కేంద్ర వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసి) గణాంకాల ప్రకారం తమిళనాడు తరువాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. దాదాపు 48 శాతం నీటి కొరతతో ఏపీ కరవు ముంగిట నిలిచింది. కర్నాటక కేరళ జలాశయాల్లో సాధారణం […]

చెన్నైలో తీవ్ర నీటి సంక్షోభం!
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2019 | 5:31 PM

దక్షిణాది రాష్ట్రాలలోని అన్ని రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు ఇప్పటికే కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ రాష్ట్రాలలో తమిళనాడు పరిస్థితి మరింత అద్వానంగా ఉంది. తమిళనాడు లోని జలాశయాలలో నీటి మట్టాలు సాధారణం కన్నా 99 శాతం తక్కువగా ఉన్నాయి. కేంద్ర వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసి) గణాంకాల ప్రకారం తమిళనాడు తరువాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. దాదాపు 48 శాతం నీటి కొరతతో ఏపీ కరవు ముంగిట నిలిచింది. కర్నాటక కేరళ జలాశయాల్లో సాధారణం కన్నా 37శాతం తక్కువగా నీటి నిల్వలు ఉన్నాయి.

తమిళనాడుకు నాలుగు ప్రాధమిక జలాశయాల నుండి నీరు లభిస్తుంది. కానీ ఈ రిజర్వాయర్లలో నీటి మట్టాలు ఇప్పటికే కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆదివారం నాటికి, రెడ్ హిల్స్, పూండి, చోలవరం మరియు చెమ్బరంబాక్కం వద్ద నాలుగు రిజర్వాయర్లలో మొత్తం నిల్వ స్థాయి కేవలం 58 mcft (మిలియన్ క్యూబిక్ అడుగులు) – వాటి మిళిత సామర్థ్యం కంటే తక్కువగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో, నాలుగు జలాశయాలు 2.8 టిఎంసిల (వేల మిలియన్ క్యూబిక్ అడుగుల) నీటిని కలిగివున్నాయి.

చెన్నైలో ఇంకిపోతున్న జలవనరులపై నగర మెట్రో వాటర్ సప్లయ్ అండ్ సేవరేజ్ బోర్డు సీనియర్ అధికారి మాట్లాడుతూ.. చెన్నై నగర రిజర్వాయర్లు ప్రమాద స్థాయికి అడుగంటిపోతున్నాయి. వీరనం చెరువులో నీటిమట్టం స్థాయి బాగానే ఉందన్నారు. ఈ చెరువు నుండి 180 ఎంఎల్ డీ నీటిని సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. నగరంలో ప్రస్తుతం పీక్ సీజన్ లో 830ఎంఎల్ డీ వరకు నీటి అవసరం అవుతోంది. దీన్ని బోర్డు 550ఎంఎల్ డీ (రోజుకు మిలియన్ లీటర్ల నీళ్లు) కి తగ్గించింది. రానున్న రోజుల్లో 500ఎంఎల్ డీ వరకు తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. చెన్నైలో నీటి కొరత అంత అధ్వానంగా లేదన్నారు. వర్షంపై ఆధారపడకుండా.. ప్రస్తుతం నగరంలో 480 ఎంఎల్ డీ నీటిని సరఫరా చేస్తున్నట్టు చెప్పారు.

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే