AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol Consumption: ఏంటి తక్కువ తాగుతున్నామని సంతోషపడుతన్నారా?.. ఈ విషయం తెలిస్తే.. గుండెల్లో గుబులే ఇక!

ఈ మధ్య కాలంలో మద్యం వినియోగం భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం 30 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న వారు మాత్రమే మద్యం సేవించే వారు. కానీ ఇప్పుడు స్కూల్‌ పిల్లలు సైతం దీనికి బానిసలవుతున్నారు. ఈ మద్యం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే కొంతమంది మేం అప్పుడప్పుడు మాత్రమే తాగుతాం.. మాకు ఎలాంటి జబ్బులు రావు అని అనుకుంటారు. కానీ అలాంటి వారికి తాజా అధ్యయనాలు షాక్ ఇచ్చాయి.

Alcohol Consumption: ఏంటి తక్కువ తాగుతున్నామని సంతోషపడుతన్నారా?.. ఈ విషయం తెలిస్తే.. గుండెల్లో గుబులే ఇక!
Even Small Amounts Of Alcohol Raise Mouth Cancer Risk
Anand T
|

Updated on: Dec 26, 2025 | 7:37 AM

Share

మద్యం..ఈ అలవాటు ఒక్కసారి స్టార్ట్ అయ్యిందే మానుకోవడం చాలా కష్టం. ఈ ఒక్క అలవాటు వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా జనాలు మద్యం అలవాటును మాత్రం మానుకోవట్లేదు. పైగా కొంతమంది తక్కువగా మద్యం తాగడం వల్ల ఎలాంటి అనారోగ్యం సమస్యలు రావని అనుకుంటారు. అదే వాళ్లు చేసే పెద్ద పొరపాటు. ఎందుకంటే తాజాగా అధ్యయనాల ప్రకరాం. మద్యానికి సురక్షిత మోతాదు అనేదేమీ లేదట, బీర్‌, విస్కీ, వైన్‌, కల్లు, నాటుసారా ఇలా ఏ డ్రింక్స్‌ తీసుకున్నా నోటి క్యాన్సర్‌ ముప్పు వంటి అనారోగ్య సమస్యలు రావచ్చట.

తాజా అధ్యయనంలో సంచన విషయాలు

తాజాగా ముంబైలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ నిజాలు వెల్లడయ్యాయి. బీఎంజే గ్లోబల్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైన నివేదికల ప్రకారం.. మద్యం కారణంగా ఓరల్ క్యాన్సన్ అనేది వస్తుంది. ఓరల్‌ క్యాన్సర్‌ వృద్ది విషయంలో మద్యపానానికి సురక్షిత మోతాదు అనేది ఉండదని నివేదిక పేర్కొంది. మీరో రోజు తక్కువ మోతాదులో మద్యం తాగినప్పడికీ అది సురక్షితం కాదని.. చివరకు అది నోటి క్యాన్సర్‌కు దారి తీస్తుందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా పొగాకు అలవాటు ఉన్న వారు మద్యం తాగడం వల్ల ఈ సమస్య ప్రభావం వారిపై మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు అలవాట్లు ఉన్న వారికి ఓరల్‌ కేవిటీ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయని అధ్యయనంలో వెల్లడైంది. సాధారణ జనాలతో పోల్చితే ఈ రెండు అలవాట్లు ఉన్న వారికి నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం 4 రెట్లు ఎక్కువగా ఉంటుందట.

ప్రమాదకర క్యాన్సర్లలో రెండో స్థానం

ఈ ఓరల్ క్యాన్సర్ అనేది మన దేశంలోని అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్‌ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ప్రతి ఏడాది సుమారు 1,43,000 మంది ఈ ఓరల్ క్యాన్సర్ భారీన పడుతున్నారు. అలాగే ఈ క్యాన్సర్ కారణంగా ప్రతి ఏడాది సుమారు 80,000 మరణాలు సంభవిస్తున్నాయి. రోజురోజుకు ఈ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతుంది, తప్ప అస్సలు తగ్గడం లేదు. అయితే మద్యం నిషేదం ఉన్న రాష్ట్రాల్లో ఈ ఓరల్‌ క్యాన్సర్‌ ముప్పు చాలా తక్కువగా ఉన్నట్లు అద్యయనం పేర్కొంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!