వాలంటీర్ చేతివాటం..’అమ్మ ఒడి’ డబ్బు స్వాహా..
చిత్తూరు జిల్లాలో గ్రామ వాలంటీర్ తన చేతివాటం చూయించాడు. మహిళకు మాయమాటలు చెప్పి ‘అమ్మ ఒడి’ డబ్బులు స్వాహా చేశాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని వి.కోట మండలం ముదరందొడి పంచాయతీ నడిపేపల్లిలో మీరాజ్ అనే మహిళ కుటుంబంతో కలిసి నివశిస్తోంది. ఇటీవలే ప్రభుత్వం రిలీజ్ చేసిన ‘అమ్మ ఒడి’ డబ్బులు ఆమె అకౌంట్‌లో జమయ్యాయి. అయితే ఏటీఎం కార్డుకు సంబంధించి కొన్ని వివరాలు నమోదు చేయాలని చెప్పి..సదరు మహిళ నుంచి […]

చిత్తూరు జిల్లాలో గ్రామ వాలంటీర్ తన చేతివాటం చూయించాడు. మహిళకు మాయమాటలు చెప్పి ‘అమ్మ ఒడి’ డబ్బులు స్వాహా చేశాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని వి.కోట మండలం ముదరందొడి పంచాయతీ నడిపేపల్లిలో మీరాజ్ అనే మహిళ కుటుంబంతో కలిసి నివశిస్తోంది. ఇటీవలే ప్రభుత్వం రిలీజ్ చేసిన ‘అమ్మ ఒడి’ డబ్బులు ఆమె అకౌంట్‌లో జమయ్యాయి. అయితే ఏటీఎం కార్డుకు సంబంధించి కొన్ని వివరాలు నమోదు చేయాలని చెప్పి..సదరు మహిళ నుంచి కార్డు తీసుకున్నాడు స్థానిక వాలంటీర్ అఫ్జల్. ఆ వెంటనే అందులో ఉన్న నగదు డ్రా చేసి వాడుకున్నాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న దంపతులు మీరాజ్, సయ్యద్ భాషా పోలీసులను ఆశ్రయించారు. దీంతో అఫ్జల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.




