తొలి టెస్టులో ఓడిపోయినా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూకుడు మీదున్న టీమిండియా సారథి..నెంబర్ వన్ స్థానానికి మరింత దగ్గరగా విరాట్
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఓటమి చవిచూసింది. అయితే తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్ పాయిట్ల పట్టికలో మాత్రం భారత జట్టు సారథి కోహ్లీ దూకుడు కొనసాగుతోంది.

ICC Men’s Test Player Rankings : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఓటమి చవిచూసింది. అయితే తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్ పాయిట్ల పట్టికలో మాత్రం భారత జట్టు సారథి కోహ్లీ దూకుడు కొనసాగుతోంది . తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేసిన కోహ్లీ రెండు పాయింట్లను ఖాతాలో వేసుకుని రెండో స్థానాన్ని మరింత పదిలపర్చుకుని మొదటి స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్‌కు దగ్గరగా చేరుకున్నాడు.
ఇదిలావుంటే.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కేవలం 1 పరుగుకే పరిమితమైన స్మిత్ 10 పాయింట్లను కోల్పోయాడు. ప్రస్తుతం కోహ్లీ 888, స్మిత్ 911 పాయింట్లతో తమ స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే మిగిలిన మూడు టెస్టుల్లో కోహ్లీ ఆడటం లేదు.. దీంతో స్మిత్ చేసే ప్రతి పరుగు పాయిట్ల పట్టికలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
మొదటి టెస్టులో 47, 6 పరుగులు చేసిన లబుషేన్ కెరీర్లో అత్యుత్తమంగా 839 పాయింట్లను సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ సారథి విలియమ్సన్ మూడో ర్యాంకులో నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌లో డకౌటైన పుజారా ఓ స్థానాన్ని కోల్పోయి 8వ ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఏడో స్థానానికి కదిలాడు.




