కోహ్లీకి విరుద్ధ ప్రయోజనాల సెగ.. బీసీసీఐలో ఫిర్యాదు..

టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఫిర్యాదు చేశారు. విరాట్ కోహ్లీ రెండు కంపెనీలకి డైరెక్టర్ హోదాలో ఉండటం విరుద్ధ ప్రయోజనాల కిందకి

కోహ్లీకి విరుద్ధ ప్రయోజనాల సెగ.. బీసీసీఐలో ఫిర్యాదు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 05, 2020 | 10:51 PM

టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఫిర్యాదు చేశారు. విరాట్ కోహ్లీ రెండు కంపెనీలకి డైరెక్టర్ హోదాలో ఉండటం విరుద్ధ ప్రయోజనాల కిందకి వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా తాజాగా బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తనకు ఓ ఫిర్యాదు అందిందని బీసీసీఐ ఎథిక్స్ అధికారి జస్టిస్ డీకే జైన్ ఆదివారం వెల్లడించారు.

కాగా.. సంజీవ్ గుప్తా.. లోధా కమిటీ పేర్కొన్న క్లాజ్‌ల్లోని నిబంధనల్ని అందులో ప్రస్తావించాడు. ‘కన్‌ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంటరెస్ట్’ నియమాలను కోహ్లీ ఉల్లంఘించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘ఈ ఫిర్యాదు నిజమేనా? కాదా? అని స్వయంగా పరిశీలించి.. ఒకవేళ నిజమే అయితే కోహ్లీ వాదన కూడా వింటాం’ అని జైన్ స్పష్టంచేశారు.

Also Read: ఆ జైలులో.. 26 మంది ఖైదీలకు కరోనా..