AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: 4 నెలల తర్వాత కొడుకును చూసి ఎగిరి గంతేసిన తల్లి, హార్ట్ టచింగ్ మూమెంట్

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా వైరల్ అయిన వీడియో మాత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఓ మహిళ తన కొడుకు నాలుగు నెలల తర్వాత ఇంటికి తిరిగి రావడాన్ని పండగగా జరుపుకుంటుంది. అతనిపై పేపర్ పూలు చల్లుతూ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.

Viral video: 4 నెలల తర్వాత కొడుకును చూసి ఎగిరి గంతేసిన తల్లి, హార్ట్ టచింగ్ మూమెంట్
Mother Love
Rajashekher G
|

Updated on: Jan 02, 2026 | 4:32 PM

Share

సోషల్ మీడియా ఎన్నో వింతలు విశేషాలకు నిలయంగా మారుతోంది. అదే సమయంలో భావోద్వేగపూరితమైన దృశ్యాలు కూడా కనిపిస్తుంటాయి. తాజాగా, ఓ మహిళ తన కొడుకు నాలుగు నెలల తర్వాత ఇంటికి తిరిగి రావడాన్ని పండగగా జరుపుకుంటుంది. అతనిపై పేపర్ పూలు చల్లుతూ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. దీంతో ప్రపంచంలో తల్లి ప్రేమే అత్యంత స్వచ్ఛమైనదంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో విద్యార్థిగా ఉన్న తన కొడుకు నాలుగు నెలల తర్వాత ఇంటికి రావడంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన కొడుకు రాక కోసం ఆమె సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. ఆమె తలుపు పక్కనే ఉండి పార్టీ పాపర్‌తో.. తన కొడుకు లోపలికి రాగానే పూల వర్షం కురిపిస్తుంది. కొడుకును చూసిన ఆ తల్లి ఆనందం ఎగిరిగంతేస్తుంది.

అనంతరం తన కొడుకును ఎంతో అప్యాయంగా ఆలింగనం చేసుకుంటుంది. కొడుకు కూడా తల్లిని ప్రేమ పూర్వకంగా కౌగలించుకుంటాడు. ఇద్దరూ భావోద్వేగానికి గురవుతారు. ఇద్దరినీ చూసి తండ్రి కూడా కొంత భావోద్వేగానికి గురవుతాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలోనూ భావోద్వేగపూరిత వాతావరణాన్ని తీసుకొచ్చింది. అనేక మంది తల్లి ప్రేమపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హృదయాన్ని కదిలించే దృశ్యం అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 30 మిలియన్లకుపైగా వ్యూస్ రాగా, 2 మిలియన్లకుపైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై 17000 మంది కామెంట్లు చేయడం గమనార్హం. వ్యూస్ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తల్లి ప్రేమ బయటికి కనిపిస్తుంది కానీ, తండ్రి కుటుంబాన్ని సంతోషించే పునాది అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. కొడుకు తన తండ్రిని కూడా కౌగిలించుకోవాలని మరో నెటిజన్ అన్నారు. అతను కూడా కొడుకు కోసం వేచి చూశాడని చెప్పారు. తల్లి ప్రేమ ప్రపంచంలోనే స్వచ్ఛమైనదని మరో నెటిజన్ ప్రశంసించాడు.