కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. ఇక వారిపై దాడి చేస్తే జైలు, భారీ జరిమానా

కోవిద్-19 విజృంభిస్తున్న తరుణంలో.. వైద్య సిబ్బందిపై దాడులు అరికట్టేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వివరించారు. ఈ క్రమంలో 1897నాటి ది ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్‌లో సవరణలు

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. ఇక వారిపై దాడి చేస్తే జైలు, భారీ జరిమానా
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2020 | 3:49 PM

కోవిద్-19 విజృంభిస్తున్న తరుణంలో.. వైద్య సిబ్బందిపై దాడులు అరికట్టేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వివరించారు. ఈ క్రమంలో ప్రభుత్వం 1897నాటి ది ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్‌లో సవరణలు చేసింది. ఆర్డినెన్స్ ప్రకారం సవరణల్లో.. డాక్టర్లపై దాడులు చేసినవారికి 6 నెలల నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించాలని పేర్కొంది. జైలు శిక్షతో పాటు రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా కూడా విధించనుంది. ఆస్పత్రి ఆస్తులు ధ్వంసం చేస్తే మార్కెట్ విలువకు రెట్టింపు జరిమానా వసూలు చేయనుంది. వైద్యుల నుంచి ఆశా వర్కర్ల వరకు, వైద్య రంగ సిబ్బంది అందరికీ రూ. 50 లక్షల బీమా కూడా ప్రకటించింది.

[svt-event date=”22/04/2020,3:33PM” class=”svt-cd-green” ]

[/svt-event]