సాధువులపై దాడి హేయమైన చర్య : కాంగ్రెస్ నాయకురాలు
మహారాష్ట్ర పాల్‌ఘర్ మూకదాడి.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గురువు పరమపదించడంతో అంత్యక్రియలకోసం అని వెళ్తున్న ఇద్దరు సాధువుల్ని.. డ్రైవర్‌ను పాల్‌ఘర్ సమీపంలో గ్రామస్థులు దాడి చేసి హతమార్చారు. అయితే సాధువులపై దాడి జరిగడం వెనక కుట్ర దాగి ఉందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో.. సాధువులపై మూకదాడి రాజకీయంగా హీటెక్కింది. దీంతో కేంద్ర హోం మంత్రి, యూపీ సీఎం యోగీ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకు ఫోన్ చేయడంతో.. ఉద్దవ్ సర్కార్ సాధువులపై దాడి చేసిన […]

మహారాష్ట్ర పాల్‌ఘర్ మూకదాడి.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గురువు పరమపదించడంతో అంత్యక్రియలకోసం అని వెళ్తున్న ఇద్దరు సాధువుల్ని.. డ్రైవర్‌ను పాల్‌ఘర్ సమీపంలో గ్రామస్థులు దాడి చేసి హతమార్చారు. అయితే సాధువులపై దాడి జరిగడం వెనక కుట్ర దాగి ఉందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో.. సాధువులపై మూకదాడి రాజకీయంగా హీటెక్కింది. దీంతో కేంద్ర హోం మంత్రి, యూపీ సీఎం యోగీ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకు ఫోన్ చేయడంతో.. ఉద్దవ్ సర్కార్ సాధువులపై దాడి చేసిన నిందితులపై కేసులు నమోదు చేసి.. 110 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు.. సాధువులపై దాడి జరుగుతుంటే నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు రావడంతో ఇద్దరు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. సాధువులను హతమార్చడం అన్నది హేయమైన చర్య అన్నారు. పాల్‌ఘర్ మూకదాడిని ఖండిస్తూ.. తన అధికారిక ఫేస్‌బుక్ ఫేజ్‌లో పోస్ట్ చేశారు.
“ఓవైపు కరోనా సమస్యతో ప్రజానీకం.. ప్రభుత్వాలు మొత్తం సతమతమవుతున్న తరుణంలో మహారాష్ట్రలో కిరాతకంగా దాడిచేసి సాధువులను హతమార్చడం చాలా హేయమైన చర్య. దీనిని యావత్ దేశం తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దారుణమైన ఘటన అనూహ్యంగా జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అనే చర్చ మొదలయింది. ఈ ఘటనపై జరుగుతున్న వాదోపవాదాలు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. ఓవైపు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నప్పుడు.. మహారాష్ట్రలో సాధువులపై దాడి ఘటనతో ప్రస్తుతం శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా జాగ్రత్తపడాల్సిన అదనపు బాధ్యత కూడా ప్రభుత్వాలపై పడింది. కరోనా కారణంగా ఇంటి నుంచి బయటకు రావద్దన్న నిబంధనలు ఉన్నప్పుడు… మహారాష్ట్రలో సాధువులపై దాడి చేసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఎలా గుమిగూడారు?.. వారి వద్దకు ఆయుధాలు ఎలా వచ్చాయి? ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్థానిక పోలీసులు ఏమి చేశారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశంలో అలజడి సృష్టించేందుకు ఈ ఘటన కారణమవుతోందని వాదన కూడా వినిపిస్తోంది. పరిస్థితి అదుపు తప్పక ముందే ఈ ఘటన వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.”