దేవరకొండ పేరుతో అమ్మాయిల ట్రాప్..రంగంలోకి హీరో

హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు తెలుగులో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. హిట్టు, ప్లాపుతో సంబంధం లేకుండా..ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ వెళ్తున్నారు. మనోడికి ఉన్న లేడీ ఫాలోయింగ్‌ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫేమ్‌ని గ్రహించిన కేటుగాళ్లు..హీరో విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. విజయ్ పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి..తనను కలవాలంటే పలానా నెంబర్‌కి ఫోన్ చెయ్యాలంటూ అజ్ఞాత వ్యక్తి  సోషల్ మీడియాలో ఫోస్టింగ్‌లు పెడుతున్నాడు.  ఇది నిజమేనని నమ్మిన చాలామంది అమ్మాయిలు..ఆ […]

దేవరకొండ పేరుతో అమ్మాయిల ట్రాప్..రంగంలోకి హీరో
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 04, 2020 | 6:01 PM

హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు తెలుగులో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. హిట్టు, ప్లాపుతో సంబంధం లేకుండా..ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ వెళ్తున్నారు. మనోడికి ఉన్న లేడీ ఫాలోయింగ్‌ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫేమ్‌ని గ్రహించిన కేటుగాళ్లు..హీరో విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. విజయ్ పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి..తనను కలవాలంటే పలానా నెంబర్‌కి ఫోన్ చెయ్యాలంటూ అజ్ఞాత వ్యక్తి  సోషల్ మీడియాలో ఫోస్టింగ్‌లు పెడుతున్నాడు.  ఇది నిజమేనని నమ్మిన చాలామంది అమ్మాయిలు..ఆ వ్యక్తితో చాటింగ్ చేశారు.

అయితే తన పేరుతో రన్ అవుతోన్న ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ హీరో విజయ్ దేవరకొండ దృష్టికి వెళ్ళింది. దీంతో అతడే స్వయంగా రంగంలోకి దిగాడు. తన వద్ద మేనేజర్‌గా పనిచేసే గోవింద్ అనే వ్యక్తితో ఫేక్ ఫ్రొఫైల్‌లో ఉన్న నెంబర్‌తో అమ్మాయిలా చాట్ చేయమని చెప్పాడు. హేమ పేరుతో వాట్సాఫ్‌లో అజ్ఞాత వ్యక్తితో చాట్ చేశాడు గోవింద్. అలా అతడి నుంచి పలు వివరాలు సేకరించిన అనంతరం, విజయ్‌కి డీటేల్స్ వివరించాడు. దీంతో విజయ్, అతని మేనేజర్ ఇద్దరూ కలిసి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 10 మంది యువతులను అజ్ఞాత వ్యక్తి ట్రాప్ చేసినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు.