Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020 : ధోనీని ఔట్ చేసి.. ఆ తర్వాత సలహా కోరిన బౌలర్

మ్యాచ్‌ అనంతరం వరుణ్‌ తన అభిమాన క్రికెటర్‌ అయిన మహేంద్రసింగ్‌ ధోనీ వద్దకు వెళ్లి కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన ఆరాధ్య క్రికెటర్‌ నుంచి పలు విలువైన సూచనలు పొందాడు. ఈ వీడియోను కోల్‌కతా టీమ్‌ సామాజిక మాధ్యమాల్లో...

IPL 2020 : ధోనీని ఔట్ చేసి.. ఆ తర్వాత సలహా కోరిన బౌలర్
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 30, 2020 | 12:28 PM

Varun Takes Tips From MSD  : క్రికెట్‌ దిగ్గజం మహేంద్రసింగ్‌ ధోనీని ఒక్కసారి ఔట్‌ చేస్తే చాలు ఏ బౌలరైనా సంతోషంతో ఎగిరి గంతేస్తాడు. అలాంటిది కోల్‌కతా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఈ సీజన్‌లో చెన్నై కెప్టెన్‌ను రెండు సార్లు పెవిలియన్‌ పంపాడు. గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధోనీని కేవలం సింగిల్ రన్ ఇచ్చి పెవిలియన్ దారి పెట్టించిన సంగతి తెలిసిందే. అయితే 15వ ఓవర్‌ వేసిన వరుణ్‌ నాలుగో బంతికి ఎంఎస్డీ క్లీన్ బౌల్డ్‌ చేశాడు. దీంతో చెన్నై గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి. కానీ చివర్లో సీఎస్కే ఆటగాడు రవీంద్ర జడేజా సిక్సర్ల మోత మోగించడంతో జట్టును విజయతీరాలకు చేరింది.

ఇక మ్యాచ్‌ అనంతరం వరుణ్‌ తన అభిమాన క్రికెటర్‌ అయిన మహేంద్రసింగ్‌ ధోనీ వద్దకు వెళ్లి కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన ఆరాధ్య క్రికెటర్‌ నుంచి పలు విలువైన సూచనలు పొందాడు. ఈ వీడియోను కోల్‌కతా టీమ్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.  చెపాక్‌ స్టేడియంలో అభిమానించే స్థాయి నుంచి ఇక్కడి దాకా అంటూ పోస్ట్‌కు కామెంట్ జోడించింది.

గతేడాది నుంచి కోల్‌కతా తరఫున ఆడుతున్న వరుణ్‌ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఢిల్లీతో తలపడిన మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసి విమర్శకులతో శభాష్ అనిపించుకున్నాడు. అంతకుముందు ఈ చెన్నై క్రికెటర్‌ చెపాక్‌ స్టేడియంలో ధోనీ బ్యాటింగ్‌ను ఆస్వాదించేవాడట. స్టాండ్స్‌లో నిలబడి మహీ సిక్సులను ఎంజాయ్‌ చేసేవాడట. ఈ క్రమంలోనే కష్టపడి బౌలర్‌గా ఎదిగాడట. ఇప్పుడు కోల్‌కతా స్పిన్నర్‌గా రాణిస్తుండడంతో ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. గతంలో