వాకాటి వాల్ జంప్ అందుకేనా ?

మొన్నటి ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లా రాజకీయాలు స్తబ్దుగా మారాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు వైసిపి క్లీన్ స్వీప్ చేయగా ఇక పెద్దగా రాజకీయ సందడి , హడావిడి లేకుండా పోయింది.. అలాంటి పరిస్థితిలో ఇపుడు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఉన్నట్లుండి కమలం పార్టీలో చేరడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.. గత కొంత కాలంగా వాకాటి పార్టీ మారతారన్న ప్రచారం జోరుగానే సాగింది. అయితే ఆయన […]

వాకాటి వాల్ జంప్ అందుకేనా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 03, 2019 | 1:17 PM

మొన్నటి ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లా రాజకీయాలు స్తబ్దుగా మారాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు వైసిపి క్లీన్ స్వీప్ చేయగా ఇక పెద్దగా రాజకీయ సందడి , హడావిడి లేకుండా పోయింది.. అలాంటి పరిస్థితిలో ఇపుడు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఉన్నట్లుండి కమలం పార్టీలో చేరడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.. గత కొంత కాలంగా వాకాటి పార్టీ మారతారన్న ప్రచారం జోరుగానే సాగింది. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారన్న అంశంపై మాత్రం రకరకాల ప్రచారం జరిగింది. చివరికి ఆయన కాషాయ తీర్జం పుచ్చుకోవడం వెనుక ఆంతర్యం, వ్యూహం ఏంటన్నది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి చూపు ఎటు వైపు.. అధికార వైసిపి లోకి వెళతారా.. లేక బిజెపి లో చేరుతారా… ఇంతకీ వాకాటి మనసులో ఏముంది.. వైసిపి లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది.. అయితే ఆ ప్రయత్నం ఫలించక పోవడంతో బిజెపి లో చేరారన్నది జిల్లాలో టాక్. 2017 స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి తరఫున ఎమ్మెల్సీ గా పోటీ చేసిన వాకాటి నారాయణ రెడ్డి విజయం సాధించారు.. గతంలో ఆయన బ్యాంకుల్లో రుణాలు తీసుకొని చెల్లించని కారణంగా సి.బి.ఐ 2018 జనవరిలో అరెస్టు చేసింది.. వాటిపై విచారణ జరుగుతున్న సందర్భంలో అప్పట్లో అధికార టిడిపి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.. 18 నెలల అనంతరం ఇటీవలే బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి వాకాటి బెయిల్ పై విడుదలయ్యారు.

జైలు నుంచి విడుదలైన నుంచి వాకాటి ఏ పార్టీలో చేరతారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అధికార వైసీపీలో చేరతారన్న ప్రచారం జోరుగానే సాగింది. వైసీపీ నేతలు కూడా ఎవరూ ఆ ప్రచారాన్ని ఖండించలేదు. అలాగని అంగీకరించనూ లేదు. దాంతో వైసీపీలో చేరడం లాంఛనమే అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే.. వాకాటి రాక పార్టీకి అప్రతిష్టను తెస్తుందని, అవినీతి రహిత పాలన అందిస్తున్నామంటూ పదేపదే చెప్పుకుంటున్న తరుణంలో వాకాటిని చేర్చుకుంటే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని వైసీపీ నేతలు అధినేత జగన్ మోహన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. దాంతో ఎటూ తేల్చుకోని వైసీపీ అధినేత.. నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం.

వైసీపీ ఎటూ తేల్చకపోవడం.. ఇటు తనపై సిబిఐ కేసుల ఒత్తిడి సో.. ఏ పార్టీలో చేరాలన్న దానిపై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది వాకాటికి. జాతీయ స్థాయిలో విశేష ప్రభావం కలిగిన బిజెపి తప్ప మరో పార్టీ కనిపించకపోవడంతో వాకాటి బిజెపి గూటికి చేరేందుకే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.  బిజెపి అగ్రనేతలతో వాకాటి మంతనాలు జరిపిన తర్వాత రాష్ట్ర నేతలు కన్నా వంటి వారితో వాకాటి భేటీ అయిన తర్వాత పార్టీలో చేరాతన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచర వర్గం చెబుతోంది. బిజెపి వ్యూహకర్త, సీనియర్ నేత రామ్ మాధవ్ సమక్షంలో పలువురు నేతలతో కలిసి వాకాటి బీజేపీలో చేరడంతో ఇప్పటి వరకు జరుగుతున్న చర్చలకు.. చెలరేగిన ఊహాగానాలకు తెరపడినట్లు అయ్యింది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..