9 సిక్సర్లు, 10 ఫోర్లతో బుడ్డోడి అరాచకం.. దులీప్‌లో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. సెంట్రల్ జోన్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లో 132 పరుగులతో ఈస్ట్ జోన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్ పోరు ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం నాడు జరగనుంది. మరో సెమీ-ఫైనల్ లో సౌత్ జోన్ వర్సెస్ నార్త్ జోన్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఈస్ట్ జోన్ ఫైనల్ ఆడనుంది.

Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తనదైన ముద్ర వేశాడు. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 132 పరుగులు చేసిన ఈ యువ బ్యాటర్.. ఈస్ట్ జోన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించి తనలోని మరో కోణాన్ని చూపించాడు. సెంట్రల్ జోన్‌తో మ్యాచ్‌లో వైభవ్ మొత్తం 124 బంతులు ఎదుర్కొని 132 పరుగులు చేశాడు. బుడ్డోడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా భారీ షాట్లతో విరుచుకుపడిన వైభవ్.. తన సహజమైన దూకుడుతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ ప్రదర్శనతో ఇప్పటివరకు వైభవ్ కేవలం పొట్టి ఫార్మాట్‌కే సరిపోతాడంటూ వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చినట్లైంది. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయగలననే సంకేతాలను ఈ ప్రదర్శన ద్వారా ఇచ్చాడు.
బౌలింగ్‌లోనూ సత్తా..
బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ వైభవ్ ఆకట్టుకున్నాడు. దులీప్ ట్రోఫీలో 2 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అతడి ప్రదర్శన కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కాలేదు.
ఫైనల్‌కు ఈస్ట్ జోన్..
వైభవ్ సూర్యవంశీతో పాటు జట్టులోకి మిగతా ఆటగాళ్ల ప్రదర్శనతో ఈస్ట్ జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్‌పై విజయం సాధించింది. ఈ గెలుపుతో దులీప్ ట్రోఫీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. యువ వయసులోనే వివిధ ఫార్మాట్లలో తన సామర్థ్యాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్న వైభవ్‌కు.. దులీప్ ట్రోఫీలో ఈ ప్రదర్శన మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




