ఘాజీపూర్ ప్రొటెస్ట్ సైట్ ని ఖాళీ చేయండి, ఘజియాబాద్ అధికారుల ఆదేశాలు, ఇక రైతులు వెనక్కి ?

ఘాజీపూర్ నిరసన స్థలం నుంచి వెళ్లిపోవాలసిందిగా (ఖాళీ చేయాల్సిందిగా) అన్నదాతలను  ఘజియాబాద్ అధికారులు ఆదేశించారు.

ఘాజీపూర్ ప్రొటెస్ట్ సైట్ ని ఖాళీ చేయండి, ఘజియాబాద్ అధికారుల ఆదేశాలు, ఇక రైతులు వెనక్కి ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 28, 2021 | 6:17 PM

ఘాజీపూర్ నిరసన స్థలం నుంచి వెళ్లిపోవాలసిందిగా (ఖాళీ చేయాల్సిందిగా) అన్నదాతలను  ఘజియాబాద్ అధికారులు ఆదేశించారు. ఇక్కడ భారీగా పోలీసులను మోహరించడమే గాక, వారు ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించారు. రైతుల నిరసన శిబిరాలను తొలగించాల్సిందిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జారీ చేసిన ఆదేశాల మేరకు తాము నడచుకున్నామని అధికారులు తెలిపారు. ఇక 24 గంటల్లోగా సింఘు బోర్డర్ ని ఖాళీ చేయాలని హిందూసేన కూడా రైతులకు అల్టిమేటం జారీ చేసింది. కాగా హర్యానాలో  ఓ గ్రామం గ్రామమే.. ఇక అన్నదాతల ఆందోళనకు తాము దూరమని, ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన ఘటనల్లో పాల్గొన్న రైతులను తాము రానివ్వబోమని హెచ్ఛరించింది. మరో వైపు ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో రైతు సంఘాల్లో చీలికలు ఏర్పడుతున్నాయి. రైతు నేత రాకేష్ టికాయత్ ప్రభుత్వానికి లొంగిపోనున్నట్టు తెలుస్తోంది.