AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కట్నం ఇవ్వలేదని.. నడిరోడ్డుపైనే ట్రిపుల్ తలాక్..!

ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఓ కేసు నమోదయ్యింది. కట్నంగా లక్ష రూపాయలు ఇవ్వలేదని ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోసీకి చెందిన జుమిరాత్‌కు మేవాత్‌ ప్రాంతానికి చెందిన ఇక్రమ్‌తో రెండేళ్ల క్రితం పెళ్లైంది. అయితే, పెళ్లి సమయంలో ఇవ్వాల్సిన కట్నానికి సంబంధించి కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఉండగా.. అదే […]

కట్నం ఇవ్వలేదని.. నడిరోడ్డుపైనే ట్రిపుల్ తలాక్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 03, 2019 | 2:11 PM

Share

ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఓ కేసు నమోదయ్యింది. కట్నంగా లక్ష రూపాయలు ఇవ్వలేదని ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోసీకి చెందిన జుమిరాత్‌కు మేవాత్‌ ప్రాంతానికి చెందిన ఇక్రమ్‌తో రెండేళ్ల క్రితం పెళ్లైంది. అయితే, పెళ్లి సమయంలో ఇవ్వాల్సిన కట్నానికి సంబంధించి కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఉండగా.. అదే నెపంతో జుమిరాత్‌ను గృహ హింసకు గురిచేస్తున్నాడు. బాధితురాలి తల్లిదండ్రులు కట్నం ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో ఇక్రమ్ నడిరోడ్డుపైనే జుమిరాత్‌కు మూడుసార్లు తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. ఈ విషయమై జుమిరాత్ తల్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం 2019లోని సెక్షన్ 4 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం ప్రకారం మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. నేరం రుజువైతే తలాక్ చెప్పిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

Follow Us
హైదరాబాద్ టూ ఊటీ.. అతి తక్కువ ధరలో కూల్ ట్రిప్..
హైదరాబాద్ టూ ఊటీ.. అతి తక్కువ ధరలో కూల్ ట్రిప్..
సప్తనదుల సంగమేశ్వరుడు.. జల గర్భం నుంచి బయటపడిన మహా శివాలయం!
సప్తనదుల సంగమేశ్వరుడు.. జల గర్భం నుంచి బయటపడిన మహా శివాలయం!
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో తెలుసా?
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో తెలుసా?
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి
69 బంతులు..21 సిక్సర్లు..195 రన్స్..మైదానంలో స్వాస్తిక్ విధ్వంసం
69 బంతులు..21 సిక్సర్లు..195 రన్స్..మైదానంలో స్వాస్తిక్ విధ్వంసం
వార్ ఎఫెక్ట్.. వాటిని వెంట తెచ్చుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల
వార్ ఎఫెక్ట్.. వాటిని వెంట తెచ్చుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల
చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.!
చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.!
ఐపీఎల్ 2026 కు ముందు సన్‌రైజర్స్ విధ్వంసం
ఐపీఎల్ 2026 కు ముందు సన్‌రైజర్స్ విధ్వంసం