ఇరాన్.. ఇక నిన్ను వదలం.. బీ రెడీ ! ట్రంప్ హెచ్చరిక
అమెరికా-ఇరాన్ మధ్య రేగిన చిన్న వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. బాగ్దాద్ లోని అమెరికన్ ఎంబసీపై ఇరాన్ అనుకూల మిలీషియా సభ్యులు దాడి చేసిన పర్యవసానం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరాన్ లోని అతి ముఖ్యమైన 52 సైట్లే లక్ష్యంగా తాము ఎటాక్ కు సిధ్ధపడుతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికన్ సైనికులపైన, ఆస్తుల పైన మీరు దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని, ఈ 52 సైట్లను నాశనం చేస్తామని […]

అమెరికా-ఇరాన్ మధ్య రేగిన చిన్న వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. బాగ్దాద్ లోని అమెరికన్ ఎంబసీపై ఇరాన్ అనుకూల మిలీషియా సభ్యులు దాడి చేసిన పర్యవసానం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరాన్ లోని అతి ముఖ్యమైన 52 సైట్లే లక్ష్యంగా తాము ఎటాక్ కు సిధ్ధపడుతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికన్ సైనికులపైన, ఆస్తుల పైన మీరు దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని, ఈ 52 సైట్లను నాశనం చేస్తామని ఆయన హెచ్ఛరించారు. ఈ 52 సైట్ల విషయాన్ని ఆయన ఇలా వివరించారు. 1979 నుంచి ఏడాదికి పైగా టెహరాన్ లోని యుఎస్ ఎంబసీలో 52 మంది అమెరికన్లను బందీలుగా ఉంచారని, ఈ విషయాన్ని తాము ఇప్పటికీ మరిచి[పోలేదని ఆయన అన్నారు. ఈ కారణంతోనే ఆ దేశంలోని కీలకమైన, ఆ దేశ సాంస్కృతిని, ఇతర చారిత్రక ఆధారాలకు నిదర్శనంగా నిలిచిన వీటిని క్షిపణులతో నాశనం చేస్తామని ఆయన పేర్కొన్నారు. మేం దాడులకు రెడీగా ఉన్నామని, కాచుకోమని అన్నారు. ఇలా ఉండగా.. బాగ్దాద్ శనివారం సాయంత్రం మోర్టార్ పేలుళ్లతో దద్దరిల్లింది. యుఎస్ ఎంబసీ ఉన్న గ్రీన్ జోన్ టార్గెట్ గా ఇరాకీ దళాలు మిసైల్ దాడులకు పూనుకొన్నాయి. అమెరికన్ సైనికులున్న బలాద్ ఎయిర్ బేస్ లక్ష్యంగా ‘ కత్యుషా ‘ రాకెట్లు పేలాయి.సైరన్లు, నిఘా డ్రోన్లతో ఈ రాకెట్లను ఎవరు ప్రయోగించారో తెలుసుకునేందుకు అమెరికా దళాలు యత్నిస్తున్నాయి. బాగ్దాద్ లోని యుఎస్ రాయబారకార్యాలయం, వద్ద అయిదు వేల మందికి పైగా అమెరికన్ సైనికులు మోహరించారు.ఇలా ఉండగా. ఇరాన్ లో ని ప్రధాన మసీదులపై తాము వార్ కు రెడీ అన్న సూచనగా ఎర్రని పతాకాలను ఎగురవేశారు. అమెరికాను దుయ్యబడుతూ పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రదర్శనలకు దిగారు. ఇరాన్ కమాండర్ సోలిమని మృతికి సంతాపం తెలుపుతూ నల్లని దుస్తులు ధరించి వేలాది మంది ర్యాలీలు నిర్వహించారు. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ‘ శపథం ‘ చేశారు.
