AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెడలో ఐడీ కార్డు.. ఆస్పత్రిలో ఉద్యోగం… నెటిజన్లను ఫిదా చేస్తున్న శునకం..

కరోనా వ్యాపిస్తుందని తెలిసినా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బాధితులకు చికిత్సలందిస్తున్నారు. కుటుంబసభ్యులకు సైతం దూరంగా ఉంటూ వైద్య సేవల్లో నిమగ్నమయ్యారు. అయితే, వీరి ఒత్తిడిని దూరం చేయడం కోసం యూఎస్‌లోని ఓహాయో రాష్ట్రంలో ఓ ఆస్పత్రి వినూత్న ఆలోచన చేసింది. ఫలితంగా ఓ శునకానికి ఉద్యోగం లభించింది.

మెడలో ఐడీ కార్డు.. ఆస్పత్రిలో ఉద్యోగం... నెటిజన్లను ఫిదా చేస్తున్న శునకం..
Balaraju Goud
|

Updated on: Dec 07, 2020 | 4:50 PM

Share

ఏడాదిగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వైద్య సిబ్బంది అహార్నిశలు శ్రమిస్తున్నారు. కరోనా వ్యాపిస్తుందని తెలిసినా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బాధితులకు చికిత్సలందిస్తున్నారు. కుటుంబసభ్యులకు సైతం దూరంగా ఉంటూ వైద్య సేవల్లో నిమగ్నమయ్యారు. అయితే, వీరి ఒత్తిడిని దూరం చేయడం కోసం యూఎస్‌లోని ఓహాయో రాష్ట్రంలో ఓ ఆస్పత్రి వినూత్న ఆలోచన చేసింది. ఫలితంగా ఓ శునకానికి ఉద్యోగం లభించింది.

స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన వెక్స్‌నర్‌ మెడికల్‌ సెంటర్‌లో షిలో అనే ఒక శునకం వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆస్పత్రి మొత్తం తిరుగుతూ కనిపించిన వారి వద్దకెళ్లి పలకరించడమే దాని పని. మనిషికి ఉండే ఒత్తిళ్లను దూరం చేయడంలో పెంపుడు జంతువులు ముఖ్య పాత్ర వహిస్తాయని, వాటితో కాసేపు సమయం గడిపితే చాలు.. ఒత్తిడి దూరమవుతుందని మానసిక నిపుణులు చెబుతుంటారు. అందుకే ఆస్పత్రి యాజమాన్యం ‘స్టార్‌ ప్రోగ్రామ్‌’ కింద శునకానికి ఇటీవల ఉద్యోగమిచ్చి వైద్య సిబ్బంది ఒత్తిడిని తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఈ శునకానికి మెడలో ఐడీ కార్డు, ప్రత్యేక గది, భోజన వసతులను సమకూర్చారు. అమాయకపు ముఖం పెట్టి పలకరింపుతో వైద్య సిబ్బంది ప్రేమాభిమానాలు పొందుతుంది. దీంతో కాసేపు కాలక్షేపం చేస్తూ వైద్య సిబ్బంది సేదతీరుతున్నారని ఆస్పత్రి యాజమాన్యం చెబుతుంది.

ఆ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్‌ షరీ డునావే.. కొత్త ఉద్యోగంలో చేరిన షిలో గురించి వివరిస్తూ పోస్టు చేశారు. దీంతో ఆ పోస్టు వైరల్‌గా మారింది. లక్షకుపైగా నెటిజన్లు ఆ ట్వీట్‌ను లైక్‌ చేశారు. వేలమంది షేర్‌ చేస్తున్నారు. ఫిలిప్పీన్స్‌లోని ఇలిగన్‌ మెడికల్‌ సెంటర్‌లోనూ ఓ శునకం ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తోందట. ఆ దేశానికి చెందిన ఓ యువతి ‘మా దేశంలోనూ ఓ శునకం ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తోంద’ని ట్వీట్‌ చేసింది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!