‘ఉప్పెన’ రికార్డు.. ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’‌కు 100 మిలియ‌న్ వ్యూస్‌.!

'ఉప్పెన' రికార్డు.. 'నీ క‌న్ను నీలి స‌ముద్రం'‌కు 100 మిలియ‌న్ వ్యూస్‌.!

దేవి శ్రీ ప్రసాద్ అంటే మాస్ బీట్స్‌కు పెట్టింది పేరు. కానీ విన‌సొంపైన బాణీలు కూర్చ‌డంలో ఎప్ప‌టిక‌ప్పుడు తన వైవిధ్యాన్ని చూపిస్తున్నారు.

Ravi Kiran

|

Aug 02, 2020 | 8:21 PM

Uppena Nee Kannu Neeli Samudram Song: దేవి శ్రీ ప్రసాద్ అంటే మాస్ బీట్స్‌కు పెట్టింది పేరు. కానీ విన‌సొంపైన బాణీలు కూర్చ‌డంలో ఎప్ప‌టిక‌ప్పుడు తన వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. కొంత కాలంగా ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’ పాట సంగీత ప్రియుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తూ, ‘ఉప్పెన‘ చిత్రంపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌స్తోంది. తాజాగా ఈ పాట ఓ ఘనతను సాధించింది. ఈ శ్రావ్య‌మైన రొమాంటిక్ సాంగ్ 100 మిలియ‌న్ వ్యూస్ అందుకుంది.

ఈ సాంగ్‌కు జావెద్ అలీ గానం తోడై మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేట్లు చేస్తోంది. అలాగే పాట‌లో హీరో హీరోయిన్లు స్క్రీన్ ప్రెజెన్స్‌, వాళ్ల ఎక్సెప్రెష‌న్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఇక ఇదే సినిమాలోని మరో పాట ‘ధ‌క్ ధ‌క్ ధ‌క్’ ఇప్ప‌టివ‌ర‌కూ 18 మిలియ‌న్ వ్యూస్ పైగా సాధించ‌డం గ‌మ‌నార్హం. కాగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్రలో కనిపించనున్నాడు. పోస్టు ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లు తెరుచుకోగానే విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu