రూ. లక్షల డబ్బు ఉన్న సంచి లాక్కుని కోతి పరార్..కన్నీరుమున్నీరయిన వృద్ధుడు. చివరకు ఏం జరిగిందంటే..?

ఆ కోతి చేసిన పనితో వృద్ధుడికి ప్రాణం పోయినంత పనయ్యింది. తన కుమారిడి చికిత్స కోసం పొలం అమ్మి మరీ...డబ్బు తీసుకెళ్తుంటే...

రూ. లక్షల డబ్బు ఉన్న సంచి లాక్కుని కోతి పరార్..కన్నీరుమున్నీరయిన వృద్ధుడు. చివరకు ఏం జరిగిందంటే..?

కోతులు చేసే తిక్క పనులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సందు దొరికితే చాలు..మన చేతుల్లో ఉన్న వస్తువులు కొట్టేస్తాయి. వాటిలో తినే పదార్థాలు అయ్యి ఉంటాయని వాటి భ్రమ. అయితే తిను బండారాలు తీసుకెళ్తే..పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ…ముఖ్యమైన వస్తువులు, నగలు, డబ్బులు లాంటివి తీసుకెళ్తేనే సమస్య. తాజాగా యూపీలని  సీతాపూర్‌ జిల్లా వికాస్‌ భవన్‌లోని రిజిస్టర్‌ కార్యాలయంలో అటువంటి సమస‌్యే తలెత్తింది.

ఖైరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు తన అనారోగ్యంతో ఉన్న తన కుమారుడి చికిత్స కోసం భూమిని విక్రయించాడు. కొనుగోలుదారుడు ఇచ్చిన 4 లక్షల రూపాయలను తన నీలం రంగు బ్యాగులో పెట్టుకున్నాడు. ఇంతలో ఓ కోతి అకస్మాత్తుగా కిందికి దూకి ఆ వృద్ధుడి చేతిలోని సంచి లాక్కొని చెట్టుపైకి వెళ్లి కూర్చుంది. దాంతో పాపం ఆ వృద్ధుడు తెగ హైరానా పడిపోయాడు. వెంటనే కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న జనాలు..దాన్ని తరిమే ప్రయత్నం చేశారు.  దీంతో కోతి డబ్బుల సంచిని గాల్లోకి విసిరేసింది. అందులోని కరెన్సీ నోట్లు చిందరవందరగా పడిపోయాయి. నోట్లు కనిపిస్తే జనం ఆగుతారా..?  వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. కాగా, కొందరు తమకు దొరికిన నోట్లను ఆ వృద్ధుడికి తిరిగిచ్చేయగా..కొందరు నొక్కేసి జేబులో పెట్టుకున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.7 వేలు నష్టపోయానని ఆ బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.

Also Read : Survey training institute : తిరుపతిలో సర్వే శిక్షణ సంస్థ ఏర్పాటుకు భూమి కేటాయింపు…అర్బన్ మండలంలోని ఆ గ్రామంలో

Click on your DTH Provider to Add TV9 Telugu