యూపీ జైళ్ల శాఖ సహాయ మంత్రి జై కుమార్ సింగ్ కి కరోనా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత కల్లోలాన్ని సృష్టిస్తోంది. అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం కరోనాతో మంచానికే పరిమితమవుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

యూపీ జైళ్ల శాఖ సహాయ మంత్రి జై కుమార్ సింగ్ కి కరోనా
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 11, 2020 | 4:34 PM

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ మహమ్మారి ధాటికి గురవుతున్న ప్రముఖుల జాబితా క్రమంగా పెరుగుతూనే ఉంది. కరోనా కట్టడికి ఫ్రంట్ వారియర్స్ ఉంటున్న వారు సైతం వైరస్ బారినపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత కల్లోలాన్ని సృష్టిస్తోంది. అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం కరోనాతో మంచానికే పరిమితమవుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా యూపీ మంత్రికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్ జైళ్ల సహాయ మంత్రి జై కుమార్ సింగ్ జైకి కరోనా సోకినట్లు వైద్యాధికారులు నిర్దారించారు. వైద్యుల సలహా మేరకు మంత్రి హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని అధికారులు తెలిపారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని మంత్రి తెలిపారు.