యూపీ ఆస్పత్రిలో వృద్ధురాలిపై దాడి..నిందితుడు అరెస్ట్

యూపీ ఆస్పత్రిలో వృద్ధురాలిపై దాడి..నిందితుడు అరెస్ట్

యూపీ ప్రయాగ్రాజ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. 80 సంవ‌త్స‌రాల‌ వృద్ధురాలిపై క్రూర ప‌ద్ద‌తిలో దాడికి పాల్ప‌డ్డాడు అక్క‌డి సెక్యూరిటీ గార్డ్.

Ram Naramaneni

|

Aug 08, 2020 | 9:52 PM

Uttar Pradesh: యూపీ ప్రయాగ్రాజ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. 80 సంవ‌త్స‌రాల‌ వృద్ధురాలిపై క్రూర ప‌ద్ద‌తిలో దాడికి పాల్ప‌డ్డాడు అక్క‌డి సెక్యూరిటీ గార్డ్. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయ్యింది. సెక్యూరిటీ గార్డ్ తీరుపై నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌ద‌రు వీడియోని గ‌మ‌నిస్తే… స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రిలో గార్డ్.. వృద్ధురాలిపై పిడిగుద్దుల‌తో విరుచుకుప‌డ‌టం స్ఫ‌ష్టంగా క‌నిపించింది. సంజయ్ మిశ్రా అనే సెక్యూరిటీ గార్డ్ తన్నడంతో పాటు కనికరం లేకుండా కొట్టడంతో ఆమె నేలమీద పడుకుని, నొప్పితో అరుస్తూ కనిపించింది. సాయం కోసం కేక‌లు వేసింది. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసు‌లు.. గార్డ్ సంజ‌య్ మిశ్రాను అరెస్ట్ చేశారు. కాగా ఆ స‌మ‌యంలో అక్క‌డ ఇద్ద‌రు వ్య‌క్తులు ఉన్న‌ట్లు వీడియో క్లిప్ ద్వారా స్ప‌ష్టం అవుతుంది. కానీ వారు దాడిని ఆపేందుకు ప్ర‌య‌త్నించ‌క‌పోడం దారుణమైన విష‌యం.

కాగా వృద్ధురాలిని అదే ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. గార్డ్ సంజ‌య్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఆ సెక్యూరిటీ గార్డ్‌ను అక్క‌డ నియ‌మించిన ప్రైవేట్ ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ఏజెన్సీని ఆసుపత్రి యాజ‌మాన్యం బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu