AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉన్నావ్ రేప్ కేసు.. బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ పై వేటు

ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ని బీజేపీ బహిష్కరించింది. పైగా అతనిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు తన బంధువులతో కలిసి ప్రయాణిస్తున్న కారును ట్రక్కుతో ఢీ కొట్టించిన ఘటనలో ఆమె బంధువుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సెంగార్ హస్తం ఉందని బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు సెంగార్ నుంచి పెను ముప్పు […]

ఉన్నావ్ రేప్ కేసు.. బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ పై వేటు
Anil kumar poka
| Edited By: |

Updated on: Aug 01, 2019 | 3:48 PM

Share

ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ని బీజేపీ బహిష్కరించింది. పైగా అతనిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు తన బంధువులతో కలిసి ప్రయాణిస్తున్న కారును ట్రక్కుతో ఢీ కొట్టించిన ఘటనలో ఆమె బంధువుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సెంగార్ హస్తం ఉందని బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు సెంగార్ నుంచి పెను ముప్పు పొంచి ఉందని వారు సుప్రీంకోర్టుకు లేఖ కూడా రాశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. సెంగార్ పై ఎందుకు చర్య తీసుకోలేదని ఏడాదికాలంగా బీజేపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అతడిని పార్టీనుంచి సస్పెండ్ చేసినట్టు బీజేపీ నేతలు ఇటీవల పేర్కొన్నారు. కానీ..ఇది కంటి తుడుపుచర్యలా ఉందని, అసలు పార్టీ పరంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు పట్టుబడుతూ వస్తున్నాయి. కాగా- యూపీలోని బీజేపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు పరోక్షంగా తప్పు పట్టడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇరకాటంలో పడింది. సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్.. ఈ కేసులో పోలీసులు, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు కోర్టుకు రాసిన లేఖ ఆలస్యంగా చేరడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Follow Us
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?
విపరీతంగా జుట్టు రాలుతోందా డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు
విపరీతంగా జుట్టు రాలుతోందా డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు
ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్
ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్
పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్!
పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్!