కోణార్క్‌ సూర్య దేవాలయం దర్శనాలు ప్రారంభం

అన్‌లాక్‌ 4.0లో భాగంగా కోణార్క్‌లోని సూర్య దేవాలయం మంగళవారం తెరుచుకుంది. కేంద్రం విడుదల చేసిన కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలయం తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

కోణార్క్‌ సూర్య దేవాలయం దర్శనాలు ప్రారంభం
Follow us

|

Updated on: Sep 02, 2020 | 4:44 PM

అన్‌లాక్‌ 4.0లో భాగంగా కోణార్క్‌లోని సూర్య దేవాలయం మంగళవారం తెరుచుకుంది. కేంద్రం విడుదల చేసిన కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలయం తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు మార్చి 15న ఆలయాన్ని మూసివేసింది. బుధవారం నుంచి మొదలైన సూర్యదేవాలయంలోకి పరిమిత సంఖ్యలో భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) ఎస్‌ఓపీల ప్రకారం.. కేవలం 2,500 మంది పర్యాటకులను మాత్రమే రెండు స్లాట్లలో అనుమతించనున్నారు. ఉదయం 1,200 మంది, మధ్యాహ్నం 1,300 మంది పర్యాటకులకు ఆలయాన్ని సందర్శించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. లాక్‌డౌన్‌కు ముందు సగటున రోజుకు 5వేల మంది పర్యాటకులు సందర్శించుకునేవారు.

ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రోజుకు 2,500 మందిని అనుమతి ఇస్తున్నట్లు పురావస్తు శాస్త్రవేత్త అరుణ్‌ మాలిక్‌ తెలిపారు. పర్యాటకులు ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు. మాస్క్‌ విధిగా ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి చేశారు. అలాగే, బహిరంగ సమావేశాలు, గ్రూప్‌ ఫొటోగ్రఫీకి అనుమతిని నిషేధించారు. రోజు రోజు ఆలయం క్రమం తప్పకుండా శుభ్రం చేసి శానిటైజ్డ్ చేయనున్నారు. ఒడిశాలోని అన్ని నాన్‌ లివింగ్‌ స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, మ్యూజియంలు జూలై 6 నుంచి కొవిడ్‌ భద్రతా జాగ్రత్తల మధ్య ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు పూరి, పరిపాలన విధించి కొవిడ్‌ ఆంక్షల కారణంగా ఆగస్టు 31 వరకు సూర్య భగవానుడి ఆలయం మూసివేయబడింది. పూరి జగన్నాథ్ ఆలయం, భువనేశ్వర్‌లోని లింగరాజ్ ఆలయాల్లో భక్తులకు ప్రవేశం కల్పించడం లేదు.