యుద్ధం అనివార్యమైతే పాకిస్థాన్ అడ్రస్ గల్లంతే : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

యుద్ధం అనివార్యమైతే పాకిస్థాన్ అనే దేశమే కనిపించదన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి. కాకినాడ జేఎన్టీయూలో ఆదివారం జరిగిన జనజాగరణ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని, ఈసారి యుద్ధమంటూ వస్తే ప్రపంచ పటంలో పాకిస్థాన్ అనే దేశం లేకుండా చేస్తామని ఆయన హెచ్చిరించారు. గత డెబ్బై ఏళ్లలో కాశ్మీర్ ప్రాంతంలో ఎలాంటి రిజర్వేషన్లు అమలు కాలేదని, ఆర్టికల్ 370 రద్దుతో […]

యుద్ధం అనివార్యమైతే పాకిస్థాన్ అడ్రస్ గల్లంతే : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2019 | 7:55 PM

యుద్ధం అనివార్యమైతే పాకిస్థాన్ అనే దేశమే కనిపించదన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి. కాకినాడ జేఎన్టీయూలో ఆదివారం జరిగిన జనజాగరణ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని, ఈసారి యుద్ధమంటూ వస్తే ప్రపంచ పటంలో పాకిస్థాన్ అనే దేశం లేకుండా చేస్తామని ఆయన హెచ్చిరించారు. గత డెబ్బై ఏళ్లలో కాశ్మీర్ ప్రాంతంలో ఎలాంటి రిజర్వేషన్లు అమలు కాలేదని, ఆర్టికల్ 370 రద్దుతో అక్కడి ప్రజలకు అన్ని హక్కులు వచ్చాయని తెలిపారు కిషన్‌రెడ్డి. ఇప్పటి వరకు జమ్ము కశ్మీర్‌లో 65వేల మంది ఉగ్రవాద దాడులు జరిగాయని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒక్క తుపాకీ కూడా పేలలేదన్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తాటాకు చప్పళ్లకు భారత్‌లో ఎవరూ భయపడే పరిస్థితి లేదన్నారు కిషన్‌రెడ్డి.

నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో ఆర్టికల్ 370ని ఏర్పాటు చేశారని, అప్పుడు 42వేల మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ ఆర్టికల్ వల్ల గతంలో పాక్‌తో నాలుగు యుద్ధాలు కూడా జరిగాయన్నారు కేంద్ర మంత్రి. ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ధైర్యంగా దీన్ని రద్దు చేశారని, దీంతో అక్కడి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన జనజాగరణ్ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి ఆర్టికల్ 370 రద్దు, పాకిస్థాన్‌పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి.

Latest Articles