ఆసక్తి రేపుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఎందుకంటే

రేపు (సోమవారం) మరోసారి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ప్రగతిభవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌ కలిసి గోదావరి జలాల తరలింపుపై చర్చించనున్నారు. ఇదే అంశంపై ఇరువురు ముఖ్యమంత్రులు గతంలో చర్చించారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలించే విషయంలో అధికారులు, ఇంజినీర్ల సమక్షంలో చర్చించారు. శ్రీశైలానికి గోదావరి జలాలు తరలించే విషయంలో ఇరు రాష్ట్రాల ఉన్నధికారులు, ఇంజినీర్లు ఉమ్మడిగా చర్చించారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను అధికారులు ఇద్దరు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. […]

ఆసక్తి రేపుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఎందుకంటే
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2019 | 6:59 PM

రేపు (సోమవారం) మరోసారి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ప్రగతిభవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌ కలిసి గోదావరి జలాల తరలింపుపై చర్చించనున్నారు. ఇదే అంశంపై ఇరువురు ముఖ్యమంత్రులు గతంలో చర్చించారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలించే విషయంలో అధికారులు, ఇంజినీర్ల సమక్షంలో చర్చించారు.

శ్రీశైలానికి గోదావరి జలాలు తరలించే విషయంలో ఇరు రాష్ట్రాల ఉన్నధికారులు, ఇంజినీర్లు ఉమ్మడిగా చర్చించారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను అధికారులు ఇద్దరు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు విభజన సమస్యలపై కూడా ఇరువురు మరోసారి చర్చించే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ కావడంపై గతంలో ప్రతిపక్ష టీడీపీ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న నీటి సమస్యల్ని సానుకూల ధృక్పధంతో పరిష్కరించుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు భావించారు. దీంతో మరోసారి గోదావరి జలాల విషయంలో ఒక పరిష్కారం కోసం రేపు (సోమవారం) జరగనున్న భేటీ చర్చనీయాంశమైంది.