బడ్జెట్ రూపకల్పనలో మీ సలహాలు.. సూచనలు కావాలి..! ఇట్లు.. మీ కేంద్ర ఆర్దిక శాఖ
వచ్చే ఏడాది ప్రవేశ పెట్టే సాధారణ బడ్జెట్‌పై సూచనలు, ప్రతిపాదనలు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. కరోనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన దృష్ట్యా... బడ్జెట్‌పై కసరత్తు చేస్తోంది.
suggestions on the general budget : వచ్చే ఏడాది ప్రవేశ పెట్టే సాధారణ బడ్జెట్‌పై సూచనలు, ప్రతిపాదనలు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. కరోనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన దృష్ట్యా… బడ్జెట్‌పై కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక సంఘాలు, పలువురు నిపుణులు సూచనలివ్వాలని పేర్కొంది.
వివిధ సంస్థలు.. వారి సలహాలను ఈ-మెయిల్ ద్వారా పంపాలని సూచించింది. నవంబర్ 15 నుంచి 30 వరకు సామాన్య ప్రజలు కూడా ‘మై గవర్నమెంట్’ వెబ్ సైట్ ద్వారా సలహాలను పంపే అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రత్యేక వెబ్సైట్ రూపొందిస్తున్నట్లు పేర్కొంది.
నిపుణులు, ఇతర వాణిజ్య సంస్థలతో బడ్జెట్ పై జరిపే ముందస్తు చర్చలను ఈ సారి భిన్నంగా నిర్వహించనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు.