ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్మక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. లాక్ డౌన్ పరిస్థితులు, కరోనా వ్యాప్తి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎల్ఏసీ వద్ద చైనా దూకుడుపై ఈ బేటీలో మంత్రివర్గం చర్చించనుంది.

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 02, 2020 | 12:21 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్మక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినెట్ భేటీ వర్చువల్ విధానంలో జరుగుతున్నట్లు సమాచారం. లాక్ డౌన్ పరిస్థితులు, కరోనా వ్యాప్తి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫాన్ తుఫాన్‌పై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. లాక్‌డౌన్ 4.0ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన కేంద్రం… లాక్‌డౌన్ మినహాయింపుల అంశాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం… దేశంలోని అనేక రంగాలకు ఊతమిచ్చే చర్యలు తీసుకుంది. ప్రధానంగా ఎల్ఏసీ వద్ద చైనా దూకుడుపై ఈ బేటీలో మంత్రివర్గం చర్చించనుంది. యుద్ధానికి సిద్ధమంటూ డ్రాగన్ దేశం కవ్వింపులకు దిగుతుండడంపై తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనున్నారు. మరోవైపు మెట్రో రైలు మార్గదర్శకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది.

వలస కూలీలు, వ్యవసాయం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కలిగించే నిర్ణయాలతో పాటు కీలకమైన సంస్కరణలు తీసుకుంది. కేంద్రం తీసుకున్న ప్యాకేజీపై వివిధ రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేయగా… మరికొన్ని రాష్ట్రాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై వస్తున్న ఫీడ్ బ్యాక్‌పై కూడా కేంద్ర కేబినెట్‌లో చర్చ జరగనుంది. మరోవైపు ప్యాకేజీలో భాగంగా అనేక రంగాలకు ఊతమిచ్చిన కేంద్రం… ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవచ్చని తెలుస్తోంది.