కాంగ్రెస్ నేతలకు కేంద్ర మంత్రి ఉచిత సలహా..

ఇంటి పోరు ఇంకెవరికో సందు అయ్యినట్లు.. కాంగ్రెస్ పార్టీ అంతర్గ విబేధాలు బీజేపీ నేతలకు ఊతం ఇస్తున్నాయి. అధిష్టానంపై అక్కసుతో ఉన్న అగ్రనేతలు ఆ పార్టీని వీడి తమ పార్టీలో చేరాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్‌లు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే బాగుంటుందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సూచించారు.

కాంగ్రెస్ నేతలకు కేంద్ర మంత్రి ఉచిత సలహా..
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 02, 2020 | 12:09 PM

ఇంటి పోరు ఇంకెవరికో సందు అయ్యినట్లు.. కాంగ్రెస్ పార్టీ అంతర్గ విబేధాలు బీజేపీ నేతలకు ఊతం ఇస్తున్నాయి. అధిష్టానంపై అక్కసుతో ఉన్న అగ్రనేతలు ఆ పార్టీని వీడి తమ పార్టీలో చేరాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్‌లు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే బాగుంటుందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సూచించారు. ఇప్పటికే సిబల్, ఆజాద్ వంటి నేతలు బీజేపీతో లాలూచీ పడ్డారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడమే వారికి ఉత్తమమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా కేంద్రంలో ఎన్‌డీఏనే అధికారంలోకి వస్తుందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గమనించాలని అన్నారు.

కాంగ్రెస్‌ను బలపరిచేందుకు సిబల్, ఆజాద్ వంటి నేతలు ఎన్నో ఏళ్లుగా ఏంతో చేశారని, కానీ ఇన్నేళ్ల తరువాత కూడా వారికి ఆ పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడం శోచనీయమని ఎద్దేవా చేశారు. ఇప్పటికే జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారని, సచిన్ పైలట్‌ కూడా పార్టీని వీడినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదన్నారు. త్వరలో అనేకమంది కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం ఉందని అన్నారు. దేశంలో ప్రస్తుతం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని గుర్తు చేసిన రాందాస్.. కులమతాలకతీతంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లోనే కాక ఆ పైన కూడా బీజేపీ నిర్విరామంగా విజయఢంకా మోగిస్తూనే ఉంటుందని అథవాలే ధీమా వ్యక్తం చేశారు.