ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ : హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రాలో మందుబాబులకు శుభవార్త వ‌చ్చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం బాటిల్స్ తెచ్చుకోవడంపై ఉన్న‌త న్యాయ‌స్థానం కీలక తీర్పు వెలువ‌రించింది.

ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ : హైకోర్టు కీలక ఆదేశాలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 02, 2020 | 11:54 AM

ఆంధ్రాలో మందుబాబులకు శుభవార్త వ‌చ్చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం బాటిల్స్ తెచ్చుకోవడంపై ఉన్న‌త న్యాయ‌స్థానం కీలక తీర్పు వెలువ‌రించింది. జీవో నెంబర్ 411 ప్రకారం మూడు మద్యం బాటిల్స్ తీసుకుని రావొచ్చని చెప్పింది. ఈ జీవోను అమలు చేయాలని ఆంధ్ర‌ప్రదేశ్ స‌ర్కార్‌కు సూచించింది. దీంతో లిక్క‌ర్ ప్రియుల‌కు ఊరట లభించింది.

జీవో నెంబర్ 411 ప్రకారం మ‌ద్యం తెచ్చుకునే వెసులుబాటు ఉన్న‌ప్ప‌టికీ, ఏపీ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ..హైకోర్టులో వాజ్యం దాఖ‌లైంది. దీనిపై విచార‌ణ జరిపిన హైకోర్టు..ఈ తీర్పు వెలువ‌రించింది.

Also Read :

కృష్ణా జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న పాముకాటు కేసులు

మద్యం వ్యవహారం : ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్