Ukraine: రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం.. రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా..?
Ukraine: మెగా డ్రోన్ అటాక్‌లో మరో యాంగిల్ టైమింగ్. రష్యాలో పార్లమెంట్ ఎన్నికల చివరి రోజునే రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. అంటే తాము మాస్కోను కూడా టార్గెట్ చేయలమని, అక్కడి జీవన పరిస్థితులను అతలాకుతలం చేయగలమని జెలెన్‌స్కీ ఈదాడులతో రష్యాకు..

Ukraine- Russia: ఈ దాడిలో వెయ్యి డ్రోన్లు అన్నది ఆందోళన కలిగించే మేటర్ అయినా, ఉక్రెయిన్ అసలు వ్యూహం మాత్రం వేరే. యుద్ధాన్ని కేవలం 1,250 కిలోమీటర్ల ఫ్రంట్‌లైన్‌కే పరిమితం చేయకుండా రష్యా భూభాగంలోకి మరింత లోతుగా తీసుకెళ్లడం కీవ్ వ్యూహంలో కీలకంగా మారింది. ముఖ్యంగా ఆయిల్ రిఫైనరీలు, ఇంధన వ్యవస్థలు, లాజిస్టిక్స్ కేంద్రాలపై దాడులతో రష్యా యుద్ధానికి అవసరమైన డబ్బు, ఇంధనం, సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి పెంచాలని ఉక్రెయిన్ ప్లాన్. మాస్కో ఆయిల్ రిఫైనరీ కూడా దెబ్బతినడం ఇక్కడ కీలక పాయింట్.
ఈ మెగా డ్రోన్ అటాక్‌లో మరో యాంగిల్ టైమింగ్. రష్యాలో పార్లమెంట్ ఎన్నికల చివరి రోజునే రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. అంటే తాము మాస్కోను కూడా టార్గెట్ చేయలమని, అక్కడి జీవన పరిస్థితులను అతలాకుతలం చేయగలమని జెలెన్‌స్కీ ఈదాడులతో రష్యాకు క్లియర్ మెస్సేజ్ ఇచ్చారంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో రష్యా కూడా కీవ్ సహా ఉక్రెయిన్ ప్రాంతాలపై డ్రోన్, క్షిపణి దాడులను కొనసాగిస్తోంది. అంటే ఫ్రంట్‌లైన్‌లో సైనిక కదలికలు డ్రోన్ల కారణంగా కష్టమవుతున్న కొద్దీ.. రెండు దేశాల మధ్య యుద్ధం దూరప్రాంతాలకు మరింత విస్తరిస్తోంది.
ఇది కూడా చదవండి: Iran Warns: అమెరికా కొత్త దాడులకు దిగితే తీవ్ర ప్రతిదాడి చేస్తాం.. యుద్ధం నిలిపివేతకు షరతులు విధించిన ఇరాన్
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




