AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు ప్రాణాలను బలిగొన్న సెప్టిక్ ట్యాంక్

దేశ రాజధాని ఢిల్లీ విధి నిర్వహణలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను కోల్పోయారు.

ఇద్దరు ప్రాణాలను బలిగొన్న సెప్టిక్ ట్యాంక్
Balaraju Goud
|

Updated on: Oct 20, 2020 | 5:34 PM

Share

దేశ రాజధాని ఢిల్లీ విధి నిర్వహణలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను కోల్పోయారు. సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు దిగిన ఇద్దరు కార్మికులు విషపు వాయువులు వ్యాపించి మరణించారు. ఈ విషాద ఘటన ఢిల్లీలోని ఆజాద్ పూర్ ప్రాంతంలో జరిగింది. ఆజాద్ పూర్ ఏరియాలోని గోల్డ్ ఫ్యాక్టరీలోని జీ బ్లాకులో ఉన్న సెప్టెక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు ముగ్గురు కార్మికులు దిగారు. వారిలో ఇద్దరు విషపు వాయువు పీల్చడంతో ఉపిరాడక మృత్యువాత పడ్డారు. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. జీటీ కర్నాల్ రోడ్డు పారిశ్రామికవాడలోని బంగారం, వెండి చైన్ల తయారీ పరిశ్రమలోని సెప్టిక్ ట్యాంకులో ఈ ప్రమాదం జరిగింది. పరిశ్రమ యజమాని రాజేందర్ సోని ట్యాంకును శుభ్రం చేసే పనిని కాంట్రాక్టరు ప్రమోద్ దాంగీకి అప్పగించారని పోలీసులు చెప్పారు. ట్యాంకులోకి దిగిన కార్మికులు ఇద్రీస్, సలీంలు మరణించారు. పరిశ్రమ యజమాని, కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow Us