బెంగ‌ళూరులో రెండు జెట్ విమానాలు ఢీ

బెంగ‌ళూరులో రెండు జెట్ విమానాలు ఢీ

బెంగళూరు: కర్ణాటకలోని యెలహంక ఏయిర్‌బేస్‌లో ఎయిరో ఇండియా – 2019 షో లో రెండు జెట్ విమానాలు ఢీ కొన్నాయి. ఈ నెల 23న బెంగళూరులో ప్రారంభంకానున్న ఎయిరో ఇండియా ప్ర‌ద‌ర్శ‌న కోసం పైల‌ట్లు రిహార్స‌ల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్య‌కిర‌ణ్ ఏయిరోబాటిక్స్ టీమ్‌కు చెందిన రెండు జెట్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. దీంతో పరిసత ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విమానాలు ఢీకొన్న వెంటనే భారీ మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 7:24 PM

బెంగళూరు: కర్ణాటకలోని యెలహంక ఏయిర్‌బేస్‌లో ఎయిరో ఇండియా – 2019 షో లో రెండు జెట్ విమానాలు ఢీ కొన్నాయి. ఈ నెల 23న బెంగళూరులో ప్రారంభంకానున్న ఎయిరో ఇండియా ప్ర‌ద‌ర్శ‌న కోసం పైల‌ట్లు రిహార్స‌ల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్య‌కిర‌ణ్ ఏయిరోబాటిక్స్ టీమ్‌కు చెందిన రెండు జెట్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. దీంతో పరిసత ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విమానాలు ఢీకొన్న వెంటనే భారీ మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో పైలట్లు ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాగా ఓ స్థానికుడికి స్వల్ప గాయాలయ్యాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu