తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం తెల్లవారు జామునుంచి భక్తులు పడిగాపులు కాస్తూ పడుతోన్న అష్టకష్టాలను టీవీ9 ప్రముఖంగా ప్రసారం చేసిన నేపథ్యంలో టీటీడీ వెంటనే స్పందించింది. టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి ఈ విషయమై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. సర్వదర్శనం టికెట్లు ఎక్కువగా ఇవ్వలేమన్న ఆయన, కొవిడ్ నిబంధనల ప్రకారం 3 వేల సర్వదర్శనం టికెట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉన్నా భక్తుల రద్దీ ఉంది కావున 5 వేల సర్వదర్శనం టికెట్లు ఇస్తున్నామని చెప్పారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో పెడితే సామాన్య భక్తులకు ఇబ్బందులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలతో సర్వదర్శనం టికెట్ల జారీపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అయితే, టీవీ9 తో చెప్పిన కాసేపటికే ధర్మారెడ్డి అధికారులతో భేటీ అయ్యారు. వేచి ఉన్న భక్తులకు సర్వదర్శనం టోకెన్లు ఇవ్వాలని సూచించారు. దీంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీవీ9కి ధన్యవాదాలు చెబుతున్నారు. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల అష్టకష్టాలు