రేప్ కేసులో టీవీ యాక్టర్ అరెస్ట్
రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ యాక్టర్ కరన్ ఒబెరాయ్ అరెస్టయ్యాడు. ఓ మహిళను బ్లాక్‌మెయిలింగ్ చేసి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముంబై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఒషివారా పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 376, 384ల కింద కరన్ ఒబెరాయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మోడల్, నటుడు అయిన కరన్ ఒబెరాయ్ పెళ్లి పేరుతో సదరు మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారని, అంతే కాకుండా సదరు మహిళ అభ్యంతర ఫొటోలు, వీడియోలను.. […]
రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ యాక్టర్ కరన్ ఒబెరాయ్ అరెస్టయ్యాడు. ఓ మహిళను బ్లాక్‌మెయిలింగ్ చేసి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముంబై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఒషివారా పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 376, 384ల కింద కరన్ ఒబెరాయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మోడల్, నటుడు అయిన కరన్ ఒబెరాయ్ పెళ్లి పేరుతో సదరు మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారని, అంతే కాకుండా సదరు మహిళ అభ్యంతర ఫొటోలు, వీడియోలను.. బహిర్గతం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఫ్యాషన్, ఫిట్‌నెస్ మోడల్ అయిన కరన్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటాడు. ప్రస్తుతం పలు టీవీ సీరియళ్లలో నటిస్తున్నాడు.