ఈ రోజు టీటీడీ పాలకమండలి సమావేశం… 107 అంశాలపై ఫోకస్..ఇందులో ఇదే కీలక అంశం..

107 అంశాలపై ఫోకస్ చేస్తోంది దేవస్థానం .  పాలకమండలి సమావేశం జరగనుంది. టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలను చేర్చే అవకాశం కనిపిస్తోంది. కరోనా ప్రభావం కాస్త తగ్గిన నేపథ్యంలో దర్శనాల సంఖ్య పెంచడంపై ప్రధానంగా చర్చించనున్నారు.

ఈ రోజు టీటీడీ పాలకమండలి సమావేశం... 107 అంశాలపై ఫోకస్..ఇందులో ఇదే కీలక అంశం..
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 28, 2020 | 9:24 AM

ఈ రోజు టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. ఈ ఉదయం 11 గంటల 45 నిమిషాలకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు సమావేశం కానున్నారు. టీటీడీ ఈఓగా జవహార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పాలకమండలి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. 107 అంశాలపై ఫోకస్ చేస్తోంది దేవస్థానం .  పాలకమండలి సమావేశం జరగనుంది. టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలను చేర్చే అవకాశం కనిపిస్తోంది. కరోనా ప్రభావం కాస్త తగ్గిన నేపథ్యంలో దర్శనాల సంఖ్య పెంచడంపై ప్రధానంగా చర్చించనున్నారు.

డిసెంబర్ 25న వైకుంఠ ఏకాదశి, వారంలో న్యూఇయర్ వేడుకలు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై టీటీడీ పాలకమండలి చర్చించనుంది. శ్రీవారి ఆలయ మహాద్వారం తలుపులు, ధ్వజస్తంభం పీఠానికి బంగారు తాపడం పనులపైను దృష్టి పెట్టనున్నారు. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టుకు దాతలిచ్చిన విరాళాలు వినియోగంపై మార్గదర్శకాలు రూపకల్పన చేయనున్నారు.

అన్న ప్రసాదం క్యాంటీన్‌లో పనిచేస్తున్న 321 మంది కాంట్రాక్టు ఉద్యోగుల కాల పరిమితి మరో ఏడాది పొడిగింపుపైనా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. లాక్‌డౌన్ సమయంలో ఆర్టీసీ బకాయి పడిన 81లక్షల లీజు మొత్తం రద్దుపైనా సభ్యులు చర్చించనున్నారు. స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల అభివృద్ధికి నిధుల కేటాయింపుపైనా నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమలలో ఔటర్ కారిడార్, తిరుపతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణంపైనా బోర్డు చర్చించనుంది.

తిరుచానూరు పద్మావతి అమ్మవారికి.. బంగారంతో సూర్యప్రభ వాహనం తయారీపై బోర్డు నిర్ణయం తీసుకోనుంది. అదే సమయంలో చెన్నైలోని పద్మావతి అమ్మవారి ఆలయానికి రాజగోపురం నిర్మాణంపై పాలకమండలి చర్చించనుంది. తిరుమల కొండపై కాటేజీల ఆధునీకరణ, బాల మందిరంలో అదనపు హాస్టల్ నిర్మాణంపైనా దృష్టి సారిస్తారు. ప్రకాశం జిల్లా దర్శి, ముండ్లమూరులో.. కడప జిల్లా ఆకేపాడు, రాయచోటిలో కళ్యాణ మండపాల నిర్మాణంపై ఓ నిర్ణయం తీసుకోనుంది పాలకమండలి.

కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్