భక్తులకు శుభవార్త.. ఇకపై తిరుమలలో ‘నో హారన్’…

తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు తిరుపతి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలను ఇక నుంచి 'నో హారన్' జోన్ గా ప్రకటిస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి వెల్లడించారు.

భక్తులకు శుభవార్త.. ఇకపై తిరుమలలో 'నో హారన్'...
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 18, 2020 | 10:49 PM

తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు తిరుపతి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలను ఇక నుంచి ‘నో హారన్’ జోన్ గా ప్రకటిస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి వెల్లడించారు. ఇకపై తిరుమలలో ఎవరూ కూడా హారన్ కొట్టకూడదని.. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేవలం గోవింద నామ స్మరణ మాత్రమే తిరుమల కొండపై వినిపించాలన్నారు. అటు భవిష్యత్తులో తిరుపతి నగరాన్ని కూడా నో హారన్ జోన్ లోకి తీసుకొస్తామని ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు.

ఇదిలా ఉంటే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో మరింత మందికి దర్శనం కల్పించే వెసులుబాటు ఉండటంతో అదనపు కోటాను విడుదల చేస్తున్నట్లు టీటీడీ ఈ మేరకు ఓ ప్రకటనలో తెలియజేసింది. రోజుకు మూడు వేల టికెట్ల చొప్పున.. రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు సంబంధిత టికెట్లన్నింటిని టీటీడీ విక్రయించింది.

Also Read:

ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు.!

సుశాంత్ ఓ క్రేజీ జీనియస్.. బాలీవుడ్‌నే అతను దూరం పెట్టాడు..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి వయోపరిమితి పెంపు..!

దేశంలో మళ్లీ లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని..

బ్రేకింగ్: ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ అద్భుత విజయం..