ఇకపై ఆర్టీసీ ప్రయాణికులపై ఛార్జీల బాదుడు.. ఎంతంటే.?

టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా చార్జీలను పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి విదితమే. ఇక ఈ చార్జీల పెంపు.. సోమవారం అర్ధరాత్రి అనగా డిసెంబర్ 3వ తేదీ నుంచి అమలు కానుంది. కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున చార్జీలు పెంచుతూ ఆర్టీసీ అధికారులు పూర్తి నివేదికను కేసీఆర్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. అంతేకాక కనీస చార్జీల విషయంలో కూడా కసరత్తులు చేశారని.. ఆర్డినరీ బస్సుల్లో కూడా సాధారణ చార్జీ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. […]

ఇకపై ఆర్టీసీ ప్రయాణికులపై ఛార్జీల బాదుడు.. ఎంతంటే.?
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 02, 2019 | 5:25 PM

టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా చార్జీలను పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి విదితమే. ఇక ఈ చార్జీల పెంపు.. సోమవారం అర్ధరాత్రి అనగా డిసెంబర్ 3వ తేదీ నుంచి అమలు కానుంది. కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున చార్జీలు పెంచుతూ ఆర్టీసీ అధికారులు పూర్తి నివేదికను కేసీఆర్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. అంతేకాక కనీస చార్జీల విషయంలో కూడా కసరత్తులు చేశారని.. ఆర్డినరీ బస్సుల్లో కూడా సాధారణ చార్జీ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మాత్రం కిలోమీటర్‌ ఆధారంగా వసూలు చేయనున్నట్లు సమాచారం.
బస్సులు వారీగా ప్రస్తుత చార్జీలు ఇలా ఉన్నాయి…
ఎక్స్‌ప్రెస్ – 87 పైసలు
డీలక్స్ – 98 పైసలు
సూపర్ లగ్జరీ – 1.16 పైసలు
రాజధానికి – 1.46 పైసలు
గరుడకు – 1.71 పైసలు
గరుడ ప్లస్ – 1.82 పైసలు
వెన్నెల సర్వీసు – 2.53 పైసలు చొప్పున ప్రస్తుతం చార్జీలు ఉండగా.. ఇప్పుడు వీటికి కిలోమీటర్ చొప్పున 20 పైసలు కలుపుతారు. ఉదాహరణకు హైదరాబాద్- కరీంనగర్ మధ్య 160 కిలోమీటర్లు దూరం కాగా.. దీని బట్టి కొత్త చార్జీ రూ.172 వరకు పెరుగుతుంది. ఇలా పెరిగిన చార్జీలన్నింటిని అధికారులు టికెట్ మిషన్స్‌లో ఫిక్స్ చేస్తున్నారు. అటు సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఇకపై కనీస టికెట్ ధర రూ.10గా చేయాలని నిర్ణయించగా.. పల్లెవెలుగు బస్సుల్లో ఆ రేట్.. రూ.8గా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ కొత్త రేట్ల వివరాన్నింటిని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. కాగా, కొత్తగా పెరగనున్న చార్జీలు ద్వారా ఆర్టీసీకి అదనంగా రూ. 752 కోట్లు రాబడి రానున్నట్లు తెలుస్తోంది.

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.