ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయసు పెంపు!

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సంతకం చేశారు. ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుంది. కాగా, ఇటీవల ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్‌లో సీఎం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన సంగతి విదితమే. అందులో భాగంగా మహిళా […]

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయసు పెంపు!
Follow us

|

Updated on: Dec 25, 2019 | 6:42 PM

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సంతకం చేశారు. ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుంది.

కాగా, ఇటీవల ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్‌లో సీఎం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన సంగతి విదితమే. అందులో భాగంగా మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటల వరకు డ్యూటీ, ప్రసూతి సెలవులు, రిటైర్మెంట్ వయసు పెంపు అంశాలపై ఆయన హామీ ఇచ్చారు. దాని అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది.