సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులంతా పాస్..
ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ చదివే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో టెన్త్ ఎగ్జామ్స్‌ని రద్దు చేసిన టీఎస్ సర్కార్.. తాజాగా ఓపెన్‌లో చదివే టెన్త్, ఇంటర్ విద్యార్థులందరినీ కూడా పాస్ చేస్తూ..

ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ చదివే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో టెన్త్ ఎగ్జామ్స్‌ని రద్దు చేసిన టీఎస్ సర్కార్.. తాజాగా ఓపెన్‌లో చదివే టెన్త్, ఇంటర్ విద్యార్థులందరినీ కూడా పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులందరికీ 35 పాస్ మార్కులను ఇవ్వాలని చెబుతూ ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. ఇక తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ఓపెన్ స్కూల్, ఇంటర్ విద్యార్థులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా కరోనా వ్యాప్తి దృష్ట్యా ఓపెన్ స్కూల్, పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ఓపెన్ స్కూల్స్ సొసైటీ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర వర్మ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ విద్యార్థులందరన్నీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో పదో తరగతిలో 35 వేల మంది విద్యార్థులు, ఇంటర్‌లో 43 వేల మంది స్టూడెంట్స్‌కి ప్రయోజనం కలిగింది.
అదిరిపోయే స్కెచ్‌తో గోల్డ్ షాపులో భారీ దోపిడి.. కట్ చేస్తే నలుగురు అరెస్ట్..
రోడ్డుపై కరోనా పేషెంట్ల ధర్నా.. భయంతో పారిపోయిన స్థానికులు..



