ఏపీలోని ఈ మూడు జిల్లాల్లోనే అత్య‌ధిక క‌రోనా కేసులు..

ప్ర‌స్తుతం ఏపీలోని క‌ర్నూలు, గుంటూరు, తూర్పు గోదావ‌రి ఈ మూడు జిల్లాల్లో కోవిడ్ పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్నాయి. ఇక ఏపీలో అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో తూర్పు గోదావరి జిల్లా టాప్‌లో ఉంది. ఈస్ట్ గోదావ‌రిలో క‌రోనా కేసుల సంఖ్య ఏకంగా 10 వేలు దాటింది. ప్ర‌స్తుతం అక్క‌డ 10,038 క‌రోనా కేసులు ఉండ‌గా..

ఏపీలోని ఈ మూడు జిల్లాల్లోనే అత్య‌ధిక క‌రోనా కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 10:57 AM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకీ కొత్త కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అటు ఏపీ ప్ర‌భుత్వం కూడా క‌రోనా క‌ట్ట‌డికి ఎన్నో ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. ఇక ప‌లు జిల్లాలోని ప్ర‌జ‌లు స్వ‌యంగా లాక్ డౌన్ కూడా విధించుకుంటున్నారు. ఇక ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర‌జా ప్ర‌తినిధులు కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఇక మ‌రోవైపు రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 72,711 ఉండ‌గా, ఇక ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్ర వ్యాప్తంగా 884 మంది మ‌ర‌ణించారు.

కాగా ప్ర‌స్తుతం ఏపీలోని క‌ర్నూలు, గుంటూరు, తూర్పు గోదావ‌రి ఈ మూడు జిల్లాల్లో కోవిడ్ పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్నాయి. ఇక ఏపీలో అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో తూర్పు గోదావరి జిల్లా టాప్‌లో ఉంది. ఈస్ట్ గోదావ‌రిలో క‌రోనా కేసుల సంఖ్య ఏకంగా 10 వేలు దాటింది. ప్ర‌స్తుతం అక్క‌డ 10,038 క‌రోనా కేసులు ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కూ 96 మంది కోవిడ్ బారిన ప‌డి మ‌ర‌ణించారు. ఇక తూర్పు గోదావ‌రిలో 6786 యాక్టీవ్ కేసులు ఉండ‌గా, 3156 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక గుంటూరులో 8097 కోవిడ్ కేసులు రిజిస్ట‌ర్ అవ్వ‌గా, ఇప్ప‌టివ‌ర‌కూ అక్క‌డ 85 మంది చ‌నిపోయారు. అలాగే క‌ర్నూలులో 8701 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వ్వ‌గా, ఏపీలోనే అత్య‌ధికంగా 142 మంది కోవిడ్‌తో ఈ జిల్లాలో మ‌ర‌ణించారు. దీంతో అధికారులు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. రానున్న రోజులు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెబుతున్నారు. ఏమాత్రం క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించినా నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా వెళ్లి టెస్టులు చేయించుకోవాల‌ని పేర్కొంటున్నారు. అలాగే వేడి ఆహారం, గోరువెచ్చ‌టి నీరు తాగాల‌ని సూచిస్తున్నారు వైద్యులు.

Read More:

హోమ్ ఐసోలేష‌న్‌లో మాజీ ఎంపీ క‌విత కుటుంబం..

మ‌హారాష్ట్ర, జ‌మ్మూక‌శ్మీర్‌లో భూ ప్ర‌కంప‌న‌లు..