పార్లమెంట్‌లో వివిధ స్టాండింగ్ కమిటీలను పునర్ నియమించారు. తాజగా జరిగిన నియామకాల్లో పలువురు టీఆర్ఎస్ ఎంపీలకు చోటు దక్కింది. పరిశ్రమల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు స్థానం లభించింది. ఎంపీ సంతోష్‌కుమార్‌ను రైల్వే స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా నియమించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ కమిటీలో సభ్యుడిగా కొత్త ప్రభాకర్ రెడ్డికి స్థానం కల్పించారు. కెప్టెన్ లక్మీకాంతరావును డిఫెన్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయం కమిటీ సభ్యులుగా ఎంపీలు వెంకటేశ్ నేత, సురేష్‌రెడ్డిలకు స్థానం కల్పించారు. ఎంపీ నామా నాగేశ్వర్‌రావును కామర్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు పార్లమెంట్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.