నా ఓటమికి రీజన్ అదే..!
గత పార్లమెంట్ ఎలక్షన్స్‌లో తన ఓటమి పట్ల మనసులో మాట బయటకు చెప్పారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. అతి ఆత్మ విశ్వాసంతో, ప్రచారం చేయకపోవడం వలనే ఓడిపోయినట్లు పేర్కొన్నారు. ఆ ఓటమి నుంచి పాఠం నేర్చుకున్నానన్న వినోద్..డిఫీట్ తనను అంతగా బాధించలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావమప్పుడు తెలంగాణ సాధనే తమ లక్ష్యమని.. తాము మంత్రులవుతామని, కేసీఆర్ సీఎం అవుతామని ఊహించలేదన్నారు. ఇక మున్సిపల్ ఎలక్షన్స్‌లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించడం ఖాయమని వినోద్ […]

గత పార్లమెంట్ ఎలక్షన్స్‌లో తన ఓటమి పట్ల మనసులో మాట బయటకు చెప్పారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. అతి ఆత్మ విశ్వాసంతో, ప్రచారం చేయకపోవడం వలనే ఓడిపోయినట్లు పేర్కొన్నారు. ఆ ఓటమి నుంచి పాఠం నేర్చుకున్నానన్న వినోద్..డిఫీట్ తనను అంతగా బాధించలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావమప్పుడు తెలంగాణ సాధనే తమ లక్ష్యమని.. తాము మంత్రులవుతామని, కేసీఆర్ సీఎం అవుతామని ఊహించలేదన్నారు.
ఇక మున్సిపల్ ఎలక్షన్స్‌లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించడం ఖాయమని వినోద్ జోస్యం చెప్పారు. పార్టీలన్నాక సమస్యలు ఉండటం కామన్ అని..అందరి ఇబ్బందులు పరిష్కరించడం సాధ్యం కాదని, పార్టీ కోసం వారంతా సపోర్ట్ చెయ్యాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కంటెస్ట్ చేయాలనుకునే నాయకులు చాలామంది ఉన్నారని, సీట్ల పంపకం పెద్ద టాస్క్ అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ మత రాజకీయాలకు త్వరలోనే ప్రజలు తిప్పికొట్టబోతున్నారని వినోద్ పేర్కొన్నారు.




