ఇది మా విజయమే : ఉత్తమ్

మక్కలు మద్దతు ధరకు గ్రామాల్లోనే ప్రభుత్వం కొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఇది ముమ్మాటికీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతులు చేపట్టిన ధర్నాకు ఫలితమన్నారు. అన్నదాత రోడ్డెక్కడంతో మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు ముందుకు వచ్చింది. క్వింటాలుకు రూ. 1850 చొప్పున వరి కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్న కొంటామని ప్రకటించిందని ఉత్తమ్ అన్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు, కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాట ఫలితంగానే ప్రభుత్వం కొనుగోళ్ళకు […]

ఇది మా విజయమే : ఉత్తమ్
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 23, 2020 | 9:58 PM

మక్కలు మద్దతు ధరకు గ్రామాల్లోనే ప్రభుత్వం కొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఇది ముమ్మాటికీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతులు చేపట్టిన ధర్నాకు ఫలితమన్నారు. అన్నదాత రోడ్డెక్కడంతో మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు ముందుకు వచ్చింది. క్వింటాలుకు రూ. 1850 చొప్పున వరి కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్న కొంటామని ప్రకటించిందని ఉత్తమ్ అన్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు, కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాట ఫలితంగానే ప్రభుత్వం కొనుగోళ్ళకు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. గ్రామాల్లోనే మద్దతు ధర చెల్లించి మక్కలు కొనుగోలు : సీఎం కేసీఆర్