
Jerusalem Under The Influence : కరోనా మహమ్మారి ధాటికి ఇజ్రాయిల్, పాలస్తీనాలు విలవిలలాడుతున్నాయి. అక్కడ ఇప్పటి దాకా 3 లక్షల 70 వేల మంది కొవిడ్ బారిన పడగా 3 వేల 100 మందికి పైగా మరణించారు. ఈ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయిల్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మహమ్మారిని కట్టడి చేసే దిశగా చేపట్టిన చర్యలు అంతగా ఫలించడం లేదు. ఏసు ప్రభువు పుట్టిన జెరూసలేం మీద కూడా కరనో ప్రభావం పడింది
కరోనాను కట్టడి చేసే దిశగా విధించిన ఆంక్షలతో జెరూసలేం సందడి కోల్పోయింది. క్రిస్మస్ రోజుల్లో కక్కిరి కనిపించే ఏసుక్రీస్తు జన్మస్థలం బోసిపోయి కనిపిస్తోంది. పండుగ సందర్భంగా ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో యాత్రీకులు, పర్యాటకులు ఈ నగరానికి వస్తుంటారు. గతంలో ఎన్నడూ ఇలాంటి దుస్థితిని చూలేదని అక్కడి గైడ్లు అంటున్నారు.
కరోనా కారణంగా విధించిన ఆంక్షలతో జెరూసలేందుకు ఎవరూ రాకపోవడంతో వ్యాపారులతో పాటు పర్యాటక రంగంపై ఆధారపడిన వారు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
జెరూసలేంలో హోటల్స్, వ్యాపారాలపై 50 వేల మంది, పర్యాటక రంగంలో మరో 10 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఏడాది కాలంగా కరోనా సంక్షోభంతో చితికి పోయిన వీరంతా క్రిస్మస్ వేళ జరిగే వ్యాపారాన్ని నమ్మకున్నారు. కానీ ఆంక్షల కారణంగా పర్యాటకులు, యాత్రీకులు రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.