తీవ్ర గాయంతో ఆసుపత్రిలో… ప్రముఖ గాయని ఎస్.జానకి
ప్రముఖ గాయని… దాదాపు అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ తన గాన మాధుర్యాన్ని పంచిన గాయని ఎస్.జానకి (81) ఆసుపత్రి పాలయ్యారు. ఆమెకు తీవ్ర గాయం కావడంతో మైసూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. బంధువుల ఇంటికి వచ్చిన జానకి కాలుజారి పడిపోయారు. వైద్యపరీక్షల్లో ఆమె తుంటిభాగంలో పగులు కనిపించినట్టు సమాచారం. ఘటన తర్వాత జానకి భరించలేనంత నొప్పితో బాధపడుతుండడంతో బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించగా, ప్రస్తుతం జానకి పరిస్థితి నిలకడగా […]
ప్రముఖ గాయని… దాదాపు అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ తన గాన మాధుర్యాన్ని పంచిన గాయని ఎస్.జానకి (81) ఆసుపత్రి పాలయ్యారు. ఆమెకు తీవ్ర గాయం కావడంతో మైసూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. బంధువుల ఇంటికి వచ్చిన జానకి కాలుజారి పడిపోయారు. వైద్యపరీక్షల్లో ఆమె తుంటిభాగంలో పగులు కనిపించినట్టు సమాచారం. ఘటన తర్వాత జానకి భరించలేనంత నొప్పితో బాధపడుతుండడంతో బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించగా, ప్రస్తుతం జానకి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.