న్యూఇయర్‌లో తారలు.. ఎవరు.. ఎక్కడెక్కడ చేసుకున్నారంటే?
న్యూఇయర్‌తో సెలబ్రిటీస్ అందరూ ఒక్కసారిగా పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. రెగ్యులర్ షూటింగ్‌లకు బైబై చెప్పేశారు. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లారు టాలీవుడ్ సెలెబ్రిటీస్. 2020 న్యూఇయర్‌కి చాలా మంది తారలు గోవాను ఎంచుకున్నట్టు తాజా సమాచారం. రాంచరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, లక్ష్మీ మంచు ఫ్యామిలీ గోవాలో న్యూఇయర్ పార్టీ చేసుకోగా, అల్లు అర్జున్ బ్యాంకాక్‌కు వెళ్లారు. స్టార్ హీరో మహేష్ బాబు కుటుంబ సమేతంగా ముంబైకి […]

న్యూఇయర్‌తో సెలబ్రిటీస్ అందరూ ఒక్కసారిగా పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. రెగ్యులర్ షూటింగ్‌లకు బైబై చెప్పేశారు. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లారు టాలీవుడ్ సెలెబ్రిటీస్. 2020 న్యూఇయర్‌కి చాలా మంది తారలు గోవాను ఎంచుకున్నట్టు తాజా సమాచారం. రాంచరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, లక్ష్మీ మంచు ఫ్యామిలీ గోవాలో న్యూఇయర్ పార్టీ చేసుకోగా, అల్లు అర్జున్ బ్యాంకాక్‌కు వెళ్లారు. స్టార్ హీరో మహేష్ బాబు కుటుంబ సమేతంగా ముంబైకి వెళ్లారు.
ఇక హీరోయిన్‌లు అయితే విదేశాల్లో వాలిపోయారు. పూజా హెగ్డే ఆస్ట్రేలియాకి వెళ్లగా.. రాశిఖన్నా తన బెస్ట్ ఫ్రెండ్‌తో లండన్‌లో సందడి చేస్తుంది. మేఘా ఆకాష్ స్పెయిన్ తీరంలోని చల్లగాలులను ఆస్వాదిస్తున్నారు. ఇక పాయల్ రాజ్‌పుత్ హిమాచల్ ప్రదేశ్‌లో ఎంజాయ్ చేస్తోంది. నిధి అగర్వాల్ 2020లో తన మొదటి రోజును షూటింగ్ లొకేషన్‌లో గడపుతోంది. అలాగే.. బాలీవుడ్ హీరోయిన్స్ పరిణితీ చోప్రా ఆస్ట్రియాలో, అనుష్కాశర్మలో స్విట్జర్లాండ్‌లో విరాట్‌తో సందడి చేసింది. కాగా.. మరికొంత సెలబ్రిటీస్ హైదరాబాద్‌లోనే న్యూఇయర్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు.