2020 అఖరు సూర్యగ్రహణం నేడే.. భారత్‌లో చూడవచ్చా..? ప్రత్యక్ష ప్రసారం చేయనున్న నాసా
ఈ ఏడాది చివరి సంపూర్ణగ్రహణం సోమవారం (నేడు) రాబోతోంది. ఈ సూర్యగ్రహణాన్ని ప్రపంచ దేశాలు చూడనున్నాయి. ఆ రోజున సూర్యుడు, భూమి మధ్యకు చంద్రుడు రాబోతున్నాడు. దీంతో సూర్య కిరణాలు
ఈ ఏడాది చివరి సంపూర్ణగ్రహణం సోమవారం (నేడు) రాబోతోంది. ఈ సూర్యగ్రహణాన్ని ప్రపంచ దేశాలు చూడనున్నాయి. ఆ రోజున సూర్యుడు, భూమి మధ్యకు చంద్రుడు రాబోతున్నాడు. దీంతో సూర్య కిరణాలు భూమిపై పడటం మానేస్తాయి. చంద్రుడి వల్ల మనకు సూర్యుడు కనిపించడు. అయితే భారత్‌లో ఇది అంత కనిపించదు. దక్షిణ అమెరికా, చిలీ, అర్జెంటినా ప్రజలకు సూర్యగ్రహణం సమయంలో చీకటిగా అవుతుంది. అలాగే పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాల్లో ఉన్న నౌకల నుంచి కూడా ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. అక్కడి వారు ఈ గ్రహణాన్ని సంపూర్ణంగా చూసే అవకాశం ఉంటుంది. ఒక సంవత్సరంలో గరిష్ట సంఖ్యలో సూర్యగ్రహణాలు చివరిసారిగా 1935 లో కనిపించగా, అలాంటి గ్రహణం 2206 లో మళ్లీ కనిపించనున్నట్లు నాసా పేర్కొంది.
గ్రహణం సమయం: ఈ సూర్యగ్రహణం ఐదు గంటల పాటు ఉంటుంది. భారత్‌లో ఉదయం 7.03 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.23 గంటలకు ముగుస్తుంది.
ఈ సూర్యగ్రహణం భారతీయులు చూడవచ్చా..? నేడు సంభవించే సూర్యగ్రహణం భారత్ సహా మిగతా దేశాల ప్రజలకు పాక్షికంగా కనిపిస్తుంది. అందువల్ల చీకటి కాదు. కానీ సూర్యుడి ముందు నుంచి నీడలా చందమామ వెళ్తున్న దృశ్యాలను ప్రత్యేక కళ్లద్దాలతో చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే గ్రహణాన్ని నేరుగా చూస్తే కంటి చూపు ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
నాసా లైవ్..
కాగా, ఈ రోజు సంభవించే సూర్యగ్రహణాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా లైవ్ ఇవ్వనుంది. అనేక అబ్జర్వేటరీలు సూర్యగ్రహనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. నాసా తన అధికారిక యూట్యూబ్ ఛానల్ నానా టెలివిజన్‌లో మొత్తం సూర్యగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అయితే దీనిపై ప్రత్యక్ష వ్యాఖ్యానం స్పానిష్‌లో ఉంటుంది. అయితే నాసా అధికారిక ట్విట్టర్ హ్యాండల్ ప్రపంచంలోని ఏ మూల నుంచైనా ఈ ఏడాది చివరి మొత్తం సూర్యగ్రహణాన్ని చూడడానికి ప్రజలకు ప్రత్యక్ష లింకును అందించనుంది.
నేటి గ్రహణం సందర్భంగా వేద పండితులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. అవి ఏమిటంటే..
గ్రహణం సమయంలో చేయాల్సిన పనులు: – గర్భవతులు సూర్యగ్రహణం సమయంలో బయటకు రాకూడదు. గ్రహణ నీడ ఎట్టి పరిస్థితుల్లో గర్భం పడకుండా చూసుకోవాలి. – సూర్యగ్రహణం సమయంలో మంత్రాలు జపించాలి. దైవానికి సంబంధించి మంత్రాలు రాకపోతే కనీసం దేవుళ్ల నామస్మరణ చేయాలని పండితులు చెబుతున్నారు. – సూర్యగ్రహణానికి ముందే ఆహారం తీనేయాలి. – అలాగే ఇంట్లో పూజ గది ఉంటే దానిపై కూడా సూర్యగ్రహణం నీడ పడకుండా ఇంటి తలుపులు, కిటికీలు మూసివేయాలి. – సూర్యగ్రహణం తర్వాత మీ ఇంట్లో ఉండే తాగునీరును మార్చేసి కొత్తగా మళ్లీ తాగునీరు తెచ్చుకోవాలి. – గ్రహణం ముగిశాక తలస్నానం చేయాలి. ఏవైనా విరాళాలు, దానాలు చేయాలనుకుంటే గ్రహణం ముందే ఇంట్లోంచి బయట పెట్టి, గ్రహణం తర్వాత దానాలు చేయాలని వేద పండితులు సూచిస్తున్నారు.
గ్రహణం సమయంలో చేయకూడనివి: – సూర్యగ్రహణం సమయంలో బయటకు వెళ్లరాదు. ముఖ్యంగా విశాలమైన, ఎవరూ లేని ప్రదేశాలకు వెళ్లరాదు. గ్రహణ సమయంలో నెగెటివ్ ఎనర్జీ, చెడు శక్తులు అత్యంత బలంగా ఉంటాయి. అందుకే బయటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. – సూర్యగ్రహణం రోజు ఎట్టి పరిస్థితుల్లో గర్భిణులు వంటలు చేయరాదు. సూది, దారం వాడకూడదు. – గ్రహణం తర్వాత ఏమీ తినకూడదు – గ్రహణం ప్రారంభమయ్యాక నిద్రపోకూడదు. ఐదు చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మాత్రం పడుకోవచ్చు. – మామూలు కళ్లద్దాలతో గ్రహణాన్ని చూస్తే కంటి సమస్య ఏర్పడుతుంది. – గ్రహణ సమయంలో తులసి ఆకులు తెంపకూడదు. – గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్న దేవుళ్లను, విగ్రహాలు, పటాలను ముట్టుకోకూడదు. – సూర్యగ్రహణం సమయంలో మాసం తినడం, మద్యం తాగడం లాంటివి చేస్తే అనేక సమస్యలు తప్పవని చెబుతున్నారు