ఏపీలో సెగలు కక్కుతున్న పాల రాజకీయాలు…సంగం డెయిరీ అక్రమాలపై విచారణకు వైసీపీ డిమాండ్
ఏపీలో పాల రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతుంది. అమూల్ డెయిరీని ఏపీలోకి తీసుకురావడం పట్ల అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అమూల్ డెయిరీ కోసం ప్రభుత్వ రంగ డెయిరీలను నాశనం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది.

అమూల్ కోసం ప్రభుత్వం అప్పులు చేయడం ఏంటని ప్రశ్నించారు సంగం డెయిరీ చైర్మన్, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. తమ డెయిరీకి నోటీసులు ఇచ్చి, ఏవేవో వివరాలు అడిగారని, దానిపై కోర్టు స్టే ఇచ్చిందని చెప్పారు. వ్యక్తులపై కోపంతో వ్యవస్థను నాశనం చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ధూళిపాళ్ల నరేంద్ర.
అయితే సంగం డెయిరీ అక్రమాలపై విచారణ జరిపించాలని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య డిమాండ్ చేశారు. సంగం డెయిరీ ఆస్తులను కొల్లగొట్టడానికి టీడీపీ నేతలు కుట్రపన్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో పాడి పశువుల కొనుగోలుకు బ్యాంకు రుణాలు తీసుకునే రైతులు కచ్చితంగా హెరిటేజ్ డెయిరీకే పాలను సరఫరా చేయాలని షరతు విధించడం చంద్రబాబు దుర్మార్గానికి నిదర్శనమని మంత్రి కన్నబాబు చెప్పారు. ఇవన్నీ బయటపడతాయనే చంద్రబాబు శాసనసభలో లేకుండా వెళ్లిపోయారని చెప్పారు.