Today Petrol, Diesel Price: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు… ఎంత పెరిగాయంటే..
Today Fuel Price: గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పెట్రోల్, డీజీల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు శుక్రవారం మరోసారి..
Today Fuel Price: గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పెట్రోల్, డీజీల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు శుక్రవారం మరోసారి పెరిగాయి. ఇక రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉన్న పెట్రోల్, డీజీల్ ధరల వివరాలు ఓసారి చూద్దాం..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.87.59గా ఉండగా.. డీజీల్ ధర 81.17గా నమోదైంది. ఇక వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.87.32 కాగా డీజీల్ 80.92గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.91.03 ఉండగా డీజీల్ రూ. 84.09గా నమోదైంది. గుంటూరులో పెట్రోల్ లీటర్ ధర రూ. 91.03 కాగా డీజీల్ ధర 84.09గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికొస్తే గురువారం లీటర్ పెట్రోల్ రూ.83.97 ఉండగా శుక్రవారం నాటికి రూ.84.20కి పెరిగింది. డీజీల్ విషయానికొస్తే.. గురువారం లీటర్ డీజీల్ ధర రూ.74.12 ఉండగా శుక్రవారం రూ.74.38కి తగ్గింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రల్ ధర రూ. 90.83 ఉండగా డీజీల్ రూ. 81.07గా ఉంది. చెన్నైలో శుక్రవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 86.96 ఉండగా డీజీల్ ధర రూ. 79.72గా ఉంది.
Also Read: Gold Rate Today : దిగివచ్చిన బంగారం.. పుత్తడి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..