బ్రేకింగ్: కరోనాతో టీఎంసీ ఎమ్మెల్యే మృతి..

దేశంలో కరోనా మహమ్మారి విజ‌ృంభణ కొనసాగుతోంది. తాజాగా కరోనా బారినపడి పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్(60) మృతి చెందారు.

  • Ravi Kiran
  • Publish Date - 10:16 am, Wed, 24 June 20
బ్రేకింగ్:  కరోనాతో టీఎంసీ ఎమ్మెల్యే మృతి..

దేశంలో కరోనా మహమ్మారి విజ‌ృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి వీఐపీల వరకు పేదోడు నుంచి పెద్దోడు దాకా అందరినీ పట్టి పీడిస్తోంది. కోవిడ్ ధాటికి తట్టుకోలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా బారినపడి పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్(60) మృతి చెందారు. గత కొద్దిరోజులుగా కోవిడ్ 19తో బాధపడుతున్న ఘోష్.. ఇవాళ ఉదయం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

కాగా, ఘోష్ మరణంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ”1998 నుంచి పార్టీ కోశాధికారిగా ఉన్న ఘోష్ పార్టీకి ఎనలేని సేవ చేశారు. ఆయన 35ఏళ్ల రాజకీయ జీవితం పూర్తిగా ప్రజాసేవకే అంకితమైంది. సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేసిన ఆయన.. 3 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలిచారు”. అని దీదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.